సొంత సినిమా నుంచి సీన్ లీక్ చేసిన విజయ దేవరకొండ

థియేటర్లలో ప్రేక్షకులు లాఫింగ్ మ్యాడ్‌నెస్‌తో ఊగిపోతున్నారని... మీరు కూడా వెళ్లి హాయిగా నవ్వుకోండని అభిమానులకు సూచించాడు విజయ్.

news18-telugu
Updated: November 1, 2019, 2:42 PM IST
సొంత సినిమా నుంచి సీన్ లీక్ చేసిన విజయ దేవరకొండ
విజయ్ దేవరకొండ
  • Share this:
టాలీవుడ్ రౌడీ విజయ దేవరకొండ ఏం చేసినా సెన్సేషనే..! అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు చిత్రసీమను ఊపేసిన విజయ దేవరకొండ.. రీసెంట్‌గా సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. 'కింగ్ ఆఫ్ హిల్' పేరుతో సొంత బ్యానర్ స్థాపించి కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. తన బ్యానర్లో వచ్చిన మొట్ట మొదటి సినిమా 'మీకు మాత్రమే చెబుతా.' ఇందులో పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించాడు. ఇవాళే విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మూవీలో కామెడీ అదిరిపోయిందని.. థియేటర్లలో నవ్వుల సందడి నెలకొందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ఓ సీన్ లీక్ చేశాడు విజయ దేవరకొండ.

ట్విటర్ వేదికగా మీకు మాత్రమే చెబుతా సినిమాలోని ఓ సీన్‌ను అభిమానులతో పంచుకున్నాడు టాలీవుడ్ రౌడీ. ఆ కామెడీ సీన్‌కు జనాలు కడుపుబ్బా నవ్వుతున్న వీడియోను షేర్ చేశాడు. థియేటర్లలో ప్రేక్షకులు లాఫింగ్ మ్యాడ్‌నెస్‌తో ఊగిపోతున్నారని... మీరు కూడా వెళ్లి హాయిగా నవ్వుకోండని అభిమానులకు సూచించాడు విజయ్. తమ సిినిమాను చూసి ప్రేక్షకులకు పగలబడి నవ్వుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. కాగా, మీకు మాత్రమే చెబుతా సినిమాలో తరుణ్ భాస్కర్‌తో పాటు వాణి భోజన్, అభినవ్ గోమఠం, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించారు. షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహించగా విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ నిర్మాతలుగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి శివ కుమార్ సంగీతం అందించారు.
Published by: Shiva Kumar Addula
First published: November 1, 2019, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading