హోమ్ /వార్తలు /సినిమా /

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ థమ్స్‌ అప్ తుపాన్ యాడ్.. యాక్షన్‌తో అదరగొట్టిన రౌడీ..

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ థమ్స్‌ అప్ తుపాన్ యాడ్.. యాక్షన్‌తో అదరగొట్టిన రౌడీ..

’థమ్స్ అప్’ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ (Twitter/Photo)

’థమ్స్ అప్’ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ (Twitter/Photo)

Vijay Devarakonda - Thums up Add : విజయ్ దేవరకొండ.. ఇంతింతై అన్నట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఇపుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్‌తో రెండు చేతుల సంపాదిస్తున్నారు. తాజాగా ఈయన థమ్స్ అప్ నేషనల్ వైడ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. దానికి సంబంధించిన యాడ్ ఇపుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

ఇంకా చదవండి ...

  Vijay Devarakonda - Thums up Add : విజయ్ దేవరకొండ.. ఇంతింతై అన్నట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఇపుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్‌తో రెండు చేతుల సంపాదిస్తున్నారు. ఇప్పటి వరకు పలు యాడ్స్‌లో విజయ్ దేరకొండ నటించినా.. అంతగా లేని ఫోకస్.. ఇపుడు ఏకంగా చిరంజీవి, మహేష్ బాబు వంటి స్టార్స్ ప్రమోట్ చేసిన ‘థమ్స్ అప్’ యాడ్‌కు ఇపుడు సౌత్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. కేవలం ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ తో యూత్‌లో ఫుల్ ఫాలోయింగ్  సంపాదించుకున్నాడు. అంతేకాదు రౌడీ బ్రాండ్‌తో కొన్ని వస్త్రాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇపుడు తాజాగా మహేష్ బాబు నుంచి థమ్సప్ యాడ్‌ను ఈయన చేతులోకి వచ్చింది.

  తాజాగా ఈ యాడ్‌లో విజయ్ దేవరకొండ.. జేమ్స్ బాండ్ లెవల్లో ఒక చేరుకు సంకెళ్లతో కట్టేసి ఉన్న అతను ఎలా తప్పించుకున్నాడు. చివరకు థమ్స్ అప్ .. అనేది సాఫ్ట్ డ్రింక్ కాదు.. తుపాను అని చెబుతాడు. మొత్తంగా ఈ యాడ్‌తో మరోసారి తన యాక్షన్‌తో అదరగొట్టాడు విజయ్ దేవరకొండ. నిన్న మొన్నటి వరకు మహేష్ బాబు చేతిలో ఉన్న ఈ యాడ్ విజయ్ దేవరకొండ చేతికి వెళ్లడం మాములు విషయం కాదు. ఈ ఎండార్స్‌మెంట్ కారణంగా విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో విజయ్ దేవరకొండ పేరు పక్కన  తుపాన్ అని పేరు కూడా యాడ్ చేసుకున్నాడు.

  మహేష్ బాబు విషయానికొస్తే..  తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. మొత్తం సౌత్ ఇండస్ట్రీలో పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే మహేష్ బాబు పేరు ముందు వినిపిస్తుంది. ప్రస్తుతం మహేష్ చేతిలో డజనుకు పైగా ఎండోర్స్‌మెంట్స్ ఉన్నాయి. సినిమాలతో పాటు వాటికి కూడా సమానంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు మహేష్. ఇంకా చెప్పాలంటే సినిమాలతో సమానంగా యాడ్స్ రూపంలో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు సూపర్ స్టార్.

  RRR : ఆర్ఆర్ఆర్ రిలీజయ్యేది మార్చి 18, ఏప్రిల్ 28 కాదు.. కొత్త డేట్ ఇదే..

  నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎన్నో మహేష్ బాబు చేతిలో ఉన్నాయి. ఈయనకు పోటీ ఇచ్చే హీరో సౌత్ ఇండస్ట్రీలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కార్పొరేట్ కంపెనీలు కూడా మహేష్ బాబు కోసం అలాగే ఎగబడుతుంటాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా బ్రాండింగ్ చేస్తున్నారు కానీ మహేష్ బాబు రేంజ్‌లో మాత్రం కాదు. ఇపుడు అదే ప్లేస్‌లో విజయ్ దేవరకొండ వచ్చి చేరాడు.

  Mahesh Babu - Sarkaru Vaari Paata : మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. అఫీషియల్ ప్రకటన..

  ప్రస్తుతం విజయ దేరకొండ  డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్  (Puri Jagannadh) దర్శకత్వంలో  ‘లైగర్’ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్  (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.  ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది.పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Liger Movie, Tollywood, Vijay Devarakonda

  ఉత్తమ కథలు