శీనయ్య సువర్ణలను ప్రేమికుల రోజున కలవండి : విజయ్ దేవరకొండ

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వస్తోన్న తాజా సినిమా ‘వ‌రల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌’ తెలిసిందే.

news18-telugu
Updated: December 12, 2019, 6:52 PM IST
శీనయ్య సువర్ణలను ప్రేమికుల రోజున కలవండి : విజయ్ దేవరకొండ
Twitter
  • Share this:
క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వస్తోన్న తాజా సినిమా ‘వ‌రల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌’ తెలిసిందే. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వస్తోన్న ఈసినిమా దాదాపు చిత్రీక‌ర‌ణ ముగించుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. క్రాంతిమాధ‌వ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రచారంలో భాగంగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తన నలుగురు లవర్స్‌ని పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. నాలుగు రోజుల్లో వరుసగా నాలుగు పోస్టర్లు వదలనున్నారు. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌లుగురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. డిసెంబ‌ర్ 12న ఐశ్వర్యా రాజేష్‌, 13న ఇజా బెల్లా, 14న క్యాథరిన్ త్రెసా, 15న రాశీఖ‌న్నాల‌కు సంబంధించిన లుక్‌లు విడుదల చేస్తున్నారు. ఈ నాలుగు లుక్స్ సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేస్తామన్నారు. అందులో భాగంగా ఈరోజు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఐశ్వర్యా రాజేష్‌‌తో విజయ రొమాంటిక్‌ లుక్‌ అదిరిపోయింది. శీనయ్యతో సువర్ణ , ప్రేమికుల రోజున కలవండి అంటూ విడుదల చేశారు. ఈ సినిమాను కె.ఎస్‌.రామారావు స‌మర్పణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్లభ నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్రవ‌రి 14న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

Published by: Suresh Rachamalla
First published: December 12, 2019, 6:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading