హోమ్ /వార్తలు /సినిమా /

Rashmika Mandanna: విజయ్ గొప్ప స్నేహితుడు.. ఆయన ఇచ్చే ఆ సలహాలను పాటిస్తాను.. రష్మిక మందన

Rashmika Mandanna: విజయ్ గొప్ప స్నేహితుడు.. ఆయన ఇచ్చే ఆ సలహాలను పాటిస్తాను.. రష్మిక మందన

Rashmika Mandanna and Vijay Devarakonda Photo : Twitter

Rashmika Mandanna and Vijay Devarakonda Photo : Twitter

Rashmika Mandanna: రష్మిక మందన, విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

  Rashmika Mandanna: రష్మిక మందన, విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా ఇద్దరికీ మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత ఇదే కాంబినేషన్‌లో వచ్చిన డియర్ కామ్రెడ్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితేనేం ఈ ఇద్దరూ ఇప్పటికే తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. విజయ్‌దేవరకొండ, రష్మిక మందన జోడీని హిట్‌పెయిర్‌గా అభివర్ణిస్తారు. వెండితెరపై ఈ జంట చూడముచ్చటగా ఉంటుందని అభిమానులు మురిసిపోతుంటారు. ఇక మరోవైపు ఈ ఇద్దరీ మధ్య ఏదో ఉందని అంటున్నారు వీరి అభిమానులు. అంతేకాదు గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఈ ఇద్దరు ఎన్నో సార్లు స్పష్టత ఇచ్చారు. తాము మంచి ఫ్రెండ్స్ పేర్కోన్న సంగతి తెలిసిందే. అది అలా ఉంటే రష్మిక విజయ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇద్దరం కెరీర్‌ను ఒకేసారి మొదలైంది కాబట్టి ఈ ప్రయాణంలో విజయ్‌ దేవరకొండ గొప్ప స్నేహితుడుగా మారాడని తెలిపింది. ఏదైనా విషయంలో మాట్లాడితే.. తామిద్దరం ఎలాంటి భేషజాలు లేకుండా అభిప్రాయాల్ని వ్యక్తం చేసుకుంటామని, కెరీర్‌ విషయంలో విజయ్‌ సలహాలు కూడా తీసుకుంటానని రష్మిక మందన్న పేర్కొంది. ఇక రష్మిక నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె అల్లు అర్జున్ 'పుష్ప‌తో పాటు శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు హిందీలో 'మిషన్‌ మజ్ను' అనే చిత్రంలో నటిస్తుంది.

  ఇక విజయ్ సినిమాల విషయానికి ఆయన ప్రస్తుతం లైగర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకుడు. హీరోయిన్’గా అనన్య పాండే నటిస్తోంది. చార్మీ, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ, కన్నడ మలయాళీ భాషాల్లో విడుదలకానుంది.

  ఇవి కూడా చూడండి :

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Rashmika mandana, Tollywood news, Vijay Devarakonda

  ఉత్తమ కథలు