పేరు మార్చుకున్న విజయ్ దేవరకొండ.. ఇక నుంచి..

విజయ్ దేవరకొండ .. యూత్‌లో అదిరిపోయే క్రేజ్ ఉన్న యువ హీరో. తన ఆటీట్యూ డ్, సినిమాలతో ఈ తరం యూత్‌కు చాలా దగ్గరయ్యాడు.

news18-telugu
Updated: January 4, 2020, 2:33 PM IST
పేరు మార్చుకున్న విజయ్ దేవరకొండ.. ఇక నుంచి..
Twitter
  • Share this:
విజయ్ దేవరకొండ .. యూత్‌లో అదిరిపోయే క్రేజ్ ఉన్న యువ హీరో. తన ఆటీట్యూ డ్, సినిమాలతో ఈ తరం యూత్‌కు చాలా దగ్గరయ్యాడు. అంతేకాకుండా రోల్ మోడల్ గా మారిపోయాడు విజయ్. ఆయన ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ నలుగురు హిరోయిన్‌లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 14న  విడుద‌ల‌వుతుంది. దీంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. అందులో భాగంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.  ఆ టీజర్‌లో విజయ్ పేరు మారింది. విజయ్ దేవరకొండ తన పేరులో మార్పు చేసుకున్నాడు. 'దేవరకొండ విజయ్ సాయి'గా తన పేరు మార్పు చేసుకున్నాడు. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాకి గాను ఆయన ఇదే పేరును వేసుకున్నాడు. కెరియర్ పరంగా మరింత కలిసి రావాలనే సెంటిమెంట్‌తో ఆయన ఇలా చేసి ఉంటాడని అనుకుంటున్నారు అభిమానులు. అది అలా ఉంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నాలుగు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా రాశీ ఖన్నా, కేథరిన్ త్రేసా.. ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లె లైట్ చేస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకుడు.
మతిపోగొడుతోన్న మంజూష అందాలు...


First published: January 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు