Vijay Devarakonda : పుట్టిన రోజు సందర్భంగా తల్లికి అపురూపమైన బహుమతిని ఇచ్చిన విజయ్ దేవరకొండ..

Vijay family Photo : Twitter

Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ.. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఓ అపురూపమైన కానుకను ఇచ్చారు. అంతేకాదు దీనికి సంబంధించి ఆయన తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

 • Share this:
  టాలీవుడ్ సెన్సెషనల్ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)  సినిమాలతో పాటు వ్యాపారం వైపు కూడా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దుస్తుల వ్యాపారంలో విజయవంతంగా దూసుకెళ్తున్న విజయ్‌ తాజాగా థియేటర్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. విజయ్ మల్టిఫ్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ తో కలసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన స్వస్థలమైన మహాబూబ్‌నగర్‌లో మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేసారు విజయ్. మల్టీప్లెక్స్‌కు ఎవిడి సినిమాస్ అని పేరు పెట్టారు. ఇది విజయ్.. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ ఏషియన్ సినిమాస్ మధ్య జాయింట్ వెంచర్‌గా వస్తోంది. ఈ థియేటర్ (Vijay Deverakonda’s AVD Cinemas) సెప్టెంబర్ 24 న నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ స్క్రీనింగ్‌తో ప్రారంభం అయ్యింది.

  మహబూబ్‌నగర్‌లో సకల సౌకర్యాలతో భారీ థియేటర్‌ను ఏవీడీ అనే పేరుతో నిర్మించారు. అయితే శుక్రవారం తన తల్లి మాధవి జన్మదినం సందర్భంగా ఆ టాకీస్‌ను ప్రారంభించిన విజయ్ ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'హ్యాపీ బర్త్‌ డే మమ్ములు. ఈ ఏవీడీ నీకోసం. నీవు ఆరోగ్యంగా ఉంటే నేను మరింత కష్టపడతాను. నీకు మరిన్ని జ్ఞాపకాలు ఇస్తా' అంటూ ట్వీట్‌ చేశారు విజయ్. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్’గా మారింది.  ఇక విజయ్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూపోందుతుంది. లైగర్‌ను (Liger) ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే  (Ananya Panday )నటిస్తోంది. ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

  Chiranjeevi : చిరంజీవి భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ ఫైనల్.. మరోసారి ఆమెకే ఫిక్స్..

  ఈ సినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం గోవాలో షూటింగ్‌ను పున : ప్రారంభించింది.

  ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. తెలుగు తమిళ నటి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

  Love Story : లవ్ స్టోరి విడుదల రోజునే మరో రికార్డ్ క్రియేట్ చేసిన సారంగ దరియా సాంగ్..

  లైగర్‌లో విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. లైగర్ సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ముందుగా ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది.

  ఇక విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత విజయ్‌తో ఉందనుందని తెలుస్తోంది.
  Published by:Suresh Rachamalla
  First published: