టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. విజయ్ అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా విజయ్ ఆటీట్యూడ్కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన స్టైల్, యాష, బాష, మాట్లాడే తీరు, కనిపించే విధానం, ఆకట్టుకునే విధానం అన్నీ కూడా అందరినీ కట్టిపడేస్తుంటాయి. అతి తక్కువ సమయంలోనే అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా తన అభిమాని మృతి చెందాడనే విషయం తెలుసుకొని ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబందించి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. విజయ్ అభిమాని హేమంత్ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో విజయ్ అభిమానితో వీడియో కాల్లో మాట్లాడి అతనిని సంతోషపరిచారు. అంతేకాదు అతనికి టీ షర్ట్స్, గిఫ్ట్స్ కూడా పంపారట. ఇక తన అభిమాన నటుడు ప్రత్యేకంగా మాట్లాడడం.. దీనికి తోడు స్వయంగా ఆయన పంపిన గిఫ్ట్‌తో ఎంతో సంతోషించారట హేమంత్. అయితే హేమంత్ ఆరోగ్యం విషమించి కన్నుమూయడంతో విజయ్ తన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ తాజాగా ఓ పోస్ట్ పెట్టారు.
ఈ సందర్భంగా ఆయన రాస్తూ.. నిజంగా నిన్ను మిస్ అవుతున్నాను హేమంత్. మనం మట్లాడుకున్నందుకు సంతోషంగా ఉంది. నీ స్వచ్ఛమైన నవ్వ్వు చూసే అవకాశం నాకు దక్కింది. నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నీతో మాట్లాడిన ఆ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి అంటూ విజయ్ భావోద్వేగం చెందారు. అంతేకాదు అప్పటి ఫోటోలను పంచుకున్నారు.
I miss you Hemanth
I am so glad we spoke,
And I got to see your sweet smile, feel your love and give you some.
With tears in my eyes, I am saying a prayer for you right now ?
Thank you to everyone who reached out to me and connected me to this sweet little boy.. pic.twitter.com/zWFKMEZIAa
— Vijay Deverakonda (@TheDeverakonda) May 1, 2021
ఇక విజయ్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఛార్మీ, కరణ్ జోహార్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ, కన్నడ మలయాళీ భాషాల్లో విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత విజయ్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood news, Vijay Devarakonda