బాలీవుడ్‌లో రీమేక్ కానున్న ‘గీతా గోవిందం’.. హీరో ఎవరంటే..

గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు బాలీవుడ్‌లో మంచి గిరాకీ ఉంది. ఇక్కడ సూపర్ హిట్టైన సినిమాలను హిందీలో ఎంచక్కా రీమేక్  చేసి సక్సెస్ అందుకుంటున్నారు. తాజాగా గీతా గోవిందం సినిమా బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు.

news18-telugu
Updated: October 6, 2019, 4:22 PM IST
బాలీవుడ్‌లో రీమేక్ కానున్న ‘గీతా గోవిందం’.. హీరో ఎవరంటే..
‘గీత గోవిందం’ మూవీ పోస్టర్
  • Share this:
గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు బాలీవుడ్‌లో మంచి గిరాకీ ఉంది. ఇక్కడ సూపర్ హిట్టైన సినిమాలను హిందీలో ఎంచక్కా రీమేక్  చేసి సక్సెస్ అందుకుంటున్నారు. పైగా కథ, స్క్రీన్ ప్లే కోసం పెద్దగా వెతుక్కోవాల్సిన పనిలేదు. ఇప్పటికే పలు టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ‘గీతా గోవిందం’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేస్తే మంచి విజయాన్నే సాధించింది. ఇక గీతా గోవిందం’ విషయానికొస్తే.. ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను ప్రముఖ దర్శక, నిర్మాత రోహిత్ శెట్టి మంచి రేటుకే దక్కించుకున్నాడు.

geetha govindam movie will remake in bollywood with ishaan khattar,geetha govindam,vijay devarakonda,geetha govindam vijay devarakonda,ishaan khattar geetha govindam remake,ishaan khattar geetha govindam remake,vijay devarakonda ishan khattar,geetha govindam teaser,geetha govindam movie,geetha govindam songs,geetha govindam trailer,geetha govindam pre release event,geetha govindam video songs,geetha govindam movie trailer,vijay devarakonda speech,geetha govindam pre release,vijay deverakonda,geetha govindam vijay devarakonda movie,geetha govindam vijay deverakonda,geetha govindam movie songs,geetha govindam live event,bollywood,hindi cinema,ఇషాన్ ఖత్తర్,గీతా గోవిందం,విజయ్ దేవరకొండ,గీతా గోవిందం విజయ్ దేవరకొండ,బాలీవుడ్‌లో రీమేక్ కానున్న గీతా గోవిందం,గీతా గోవిందం,ఇషాన్ ఖత్తర్,ఇషాన్ ఖట్లర్ గీతా గోవిందం,కబీర్ సింగ్,షాహిద్ కపూర్,
గీతా గోవిందం రీమేక్‌లో ఇషాన్ ఖత్తర్ (Twitter/Photo)


ఈ సినిమాను హిందీలో ఇషాన్ ఖత్తర్ హీరోగా తెరకెక్కే అవకాశాలున్నాయి. ఈ సినిమాను రోహిత్ శెట్టి  కాకుండా వేరే దర్శకుడు తెరకెక్కిస్తారట. రోహిత్ శెట్టి ఇప్పటికే సౌత్‌లో హిట్టైన ‘సింగం’, ‘టెంపర్’ సినిమాలను హిందీ నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నాడు. ఇపుడు ‘గీతా గోవిందం’ సినిమాను తన నిర్మాణంలో ఎలా తెరకెక్కిస్తాడనేది చూడాలి.
First published: October 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading