మీరెవ్వర్రా నన్ను అడగడానికి.. ఆ వెబ్‌సైట్స్‌పై విజయ్ దేవరకొండ ఫైర్..

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ చాలా రోజుల తర్వాత మళ్లీ ఫైర్ అయ్యాడు. అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి టైమ్ తర్వాత మళ్లీ ఆయనలో అంత కోపం చూడలేదు.. కోపం కాదది అసహనం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 4, 2020, 10:44 PM IST
మీరెవ్వర్రా నన్ను అడగడానికి.. ఆ వెబ్‌సైట్స్‌పై విజయ్ దేవరకొండ ఫైర్..
ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా కూడా దేశవ్యాప్తంగా విడుదల కానుంది. దీనిపై భారీగానే అంచనాలున్నాయి.
  • Share this:
విజయ్‌ దేవరకొండ చాలా రోజుల తర్వాత మళ్లీ ఫైర్ అయ్యాడు. అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి టైమ్ తర్వాత మళ్లీ ఆయనలో అంత కోపం చూడలేదు.. కోపం కాదది అసహనం. ఎందుకంటే మంచి చేస్తున్నా కూడా అడ్డుపడుతున్నారంటూ ఆయన చూపించిన అసహనం. సాయం చేస్తున్నా కూడా ఆపేస్తున్నారంటూ అసహనం.. మిడిల్ క్లాస్ కుటుంబాలను ఆదుకోడానికి ఓ కార్యక్రమం మొదలుపెడితే అందులో కూడా తప్పులు వెతికి తన పేరు నాశనం చేస్తున్నారని అసహనం.. అన్నీ కలిపి ఒకేసారి సమాధానం చెప్పాడు విజయ్ దేవరకొండ.


ఓ మూడు నాలుగు వెబ్‌సైట్లు కావాలనే తనకు చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని.. వాళ్ల తప్పుడు రాతల్ని తనపై రుద్దుతున్నారని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. అసలు మీరెవర్రా నన్ను ప్రశ్నించడానికి అంటూ ఫైర్ అయ్యాడు ఈయన. తన పేరును నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఏకంగా 21 నిమిషాల వీడియోను షేర్‌ చేసాడు విజయ్. కొన్ని వెబ్‌సైట్లు కావాలనే విపరీతంగా తప్పుడు వార్తలు రాస్తున్నాయని.. అందులో ముఖ్యంగా రెండు మూడు వెబ్‌సైట్స్ మాత్రం ఏ మాత్రం అర్హత లేకుండా ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే కూడా కక్ష్య పెట్టుకుని రాస్తున్నారంటూ మండిపడ్డాడు ఈయన.
విజయ్ దేవరకొండ (vijay devarakonda)
విజయ్ దేవరకొండ (vijay devarakonda)
వీళ్ళ వల్ల చాలా మంది నష్టపోతున్నారని వాపోయాడు విజయ్. సినిమా ఇండస్ట్రీపై బతుకుతూ.. అదే ఇండస్ట్రీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డాడు. ఈయనకు మహేష్ బాబు కూడా సపోర్ట్ చేసాడు. మనం ఎన్నో ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న పేరు, పరువును నాశనం చేయడానికి కొందరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని మహేష్ బాబు కూడా ట్వీట్ చేసాడు. వాళ్లే కాదు ఇంకొందరు కూడా విజయ్ దేవరకొండకు సపోర్టుగా నిలిచారు. ఇది పెద్ద సంచలనంగా మారేలా కనిపిస్తుందిప్పుడు.
Published by: Praveen Kumar Vadla
First published: May 4, 2020, 10:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading