Vijay Devarakonda : షర్ట్ పై బటన్‌ను విప్పేసి అందాలు ఆరబోస్తున్న రౌడీ భామ..

Vijay Devarakonda-Ananya Panday: షర్ట్ పై బటన్‌ను విప్పేసి అందాల ఆరబోస్తున్న రౌడీ భామ..

news18-telugu
Updated: December 1, 2020, 1:42 PM IST
Vijay Devarakonda : షర్ట్ పై బటన్‌ను విప్పేసి అందాలు ఆరబోస్తున్న రౌడీ భామ..
అనన్యపాండే Photo : Instagram
  • Share this:
పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఫైటర్ పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరీ, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీలో కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరించనున్నాడు. దాదాపు ఓ 40 రోజుల పాటు ముంబైలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే షూటింగ్‌ను పున: ప్రారంభించనుంది. ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన హీందీ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే నటిస్తోంది. అనన్య పాండే గతంలో రెండు సినిమాలు చేసింది. స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2 సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అనన్య ఆ తర్వాత 'పతి పత్ని ఔర్ వో' సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టరయినా కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది అనన్య. అది అలా ఉంటే ఈ సినిమా విడుదల కాకముందే తన అందాలను అందరికీ పరిచయం చేయాలని ఉవ్విళ్లూరుతోన్నట్టు కనిపిస్తోంది అనన్య. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య అనన్య నడుమును విజయ్ దేవరకొండ గట్టిగా హత్తుకున్న ఫోటోలు ఎంతగా హల్చల్ చేశాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె షర్ట్ విప్పేసి సెగలు రేపుతున్న ఫోటో అందర్నీ కళ్లప్పగించి చూసేలా ఉన్నాయి.




ఇక విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతోన్న ఫైటర్ మూవీతో ప్యాన్ ఇండియన్ స్టార్‌గా ఎదగబోతోంది అనన్య పాండే. ఈ మూవీతో మొదటి సారి నేరుగా దక్షిణాది ప్రేక్షకులను పలకరించబోతోంది ఈ భామ. ఇక ఈ సినిమాతో తెలుగు వారికి పరిచయమవుతోన్న అనన్యకు అప్పుడే టాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయట. ఇక్కడి యువ హీరోలు ఆమెను రికమెండ్ చేస్తున్నారట. అందులో భాగంగా ఈ భామకు అడ్వాన్స్‌లు ఇవ్వడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారట. అంతేకాదు స్టార్ హీరోయిన్స్‌తో సమానంగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదని టాక్. దీంతో వరుస విజయాలు అందుకుంటూ ఊపేస్తోన్న రష్మిక మందన, పూజా హెగ్డేలకు ఈ భామ గట్టిపోటీ ఇవ్వనుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
Published by: Suresh Rachamalla
First published: December 1, 2020, 1:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading