హోమ్ /వార్తలు /సినిమా /

ఆ రోజున మహర్షి విడుదల ఒత్తిడిని కల్గిస్తోంది : విజయ్ దేవరకొండ

ఆ రోజున మహర్షి విడుదల ఒత్తిడిని కల్గిస్తోంది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ (Soruce: Maharshi movie pre release event)

విజయ్ దేవరకొండ (Soruce: Maharshi movie pre release event)

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం 'మహర్షి' ప్రీ-రిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా జరిగింది. ఈ ప్రీరిలీజ్ వేడుకలో హీరోలు విక్టరీ వెంకటేశ్, విజయ దేవరకొండలు పాల్గొన్నారు.

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం 'మహర్షి' ప్రీ-రిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా జరిగింది. ఈ ప్రీరిలీజ్ వేడుకలో హీరోలు విక్టరీ వెంకటేశ్, విజయ దేవరకొండలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ మాట్లాడారు. తన బర్త్ డే రోజు విడుదల కానున్న ‘మహర్షి’ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరారు’ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ మాట్లాడుతూ.. ‘కామ్రేడ్స్.. మహేష్ బాబు అభిమానులు ఎలా ఉన్నారు. నా ఫేవరేట్ డైలాగ్.. ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు..అంటూ ప్రేక్షకుల్నీ అలరించాడు. ఆయన మాట్లాడుతూ.. మీకు తెలుసు నేను మహేష్ బాబు ఫ్యాన్‌ అని. అయితే మహేష్ బాబుని సార్ అని పిలవడం ఇబ్బందిగా ఉంటుంది నాకు.. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ నుండి మహేష్ బాబు.. మహేష్ బాబు అంటూ, ఆయన సినిమాలు చూసేవాన్ని.. సడెన్‌గా స్టార్ అయ్యాక సార్ అని పిలవడం ఇబ్బందిగా ఉంది.. అని చెబుతూ.. మహష్ సినిమాల గురించి చెప్పారు. 'నేను సినిమాలు చూడటం మహేష్ బాబు మురారితో మొదలు పెట్టానని..ఆయన సినిమాల టిక్కెట్లకు చాలా కష్టపడ్డానని చెప్పారు.


  మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు,విజయ్ దేవరకొండ,వెంకటేష్


  విజయ్ హీరోగా మారిన తర్వాత..తన అనుభవాలను చెబుతూ.. 'నేను ఫస్ట్ టైం యాక్టర్ అయిన తరువాత ఆరవ వరుసలో కూర్చున్నానని.. 'శ్రీమంతుడు' అవార్డ్ తీసుకోవడానికి మహేష్ బాబు కూడా వచ్చారు. ఆయన్ని నేను వెనుక నుండి చూసినప్పుడు.. లైఫ్ అంటే ఇలా ఉండాలిరా.. మనం రాగానే లేచి నమస్తే పెట్టాలి.. ముందు కుర్చోవాలి అనుకున్నా..అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఈ సినిమాను ఈ నెల 9 న విడుదల చేస్తున్నారు. ఆరోజు నా బర్త్ డే కూడా. అయితే నా బర్త్‌డే నాడు సినిమా విడుదల కావడంతో నాకు ఒత్తిడిగా ఫీల్ అవుతున్నానని చెబుతూ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటున్నాని అన్నారు.. విజయ్.

  First published:

  Tags: #Maheshbabu25, Maharshi, Mahesh babu, Pooja Hegde, Tamil Cinema, Telugu Cinema, Vijay Devarakonda

  ఉత్తమ కథలు