Home /News /movies /

VIJAY DEVARAKONDA ENTRY TO NEW BUSINESS HERE ARE THE DETAILS TA

Vijay Devarakonda: బిజినెస్ మేన్‌గా మారిన విజయ్ దేవరకొండ.. కొత్త వ్యాపారంలోకి అర్జున్ రెడ్డి..

విజయ్ దేవరకొండ (Twitter/Photo)

విజయ్ దేవరకొండ (Twitter/Photo)

Vijay Devarakonda Business | మన హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వేరే వ్యవహారాల్లో కూడా భాగస్వాములవుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు.

    Vijay Devarakonda Business | మన హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వేరే వ్యవహారాల్లో కూడా భాగస్వాములవుతున్నారు. ఎక్కువ మంది హీరోలు .. ఓ వైపు సినిమాలు చేస్తూనే..మరోవైపు యాడ్స్‌తో రెండు చేతులు సంపాదిస్తున్నారు. ఇంకొందరు దీపం ఉండగానే దీపం చక్కబెట్టుకున్నట్టు సినిమాలతో పాటు వేరే వ్యాపారాలు కూడా చేస్తూ రియల్ బిజినెస్ మేన్‌ అనిపించుకుంటారు. తాజాగా టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా మరో కొత్త బిజినెస్‌లో పార్టనర్ అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో ఈయన కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశారు. ఈ ఫ్రైడే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికల్ సమ్మిట్‌లో వాల్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ ప్రతినిధులతో కలిసి విజయ్ దేవరకొండ పాల్గొన్నారు.


    ఈ కంపెనీకి చెందిన ఎలక్రిక్ బైక్స్, స్కూటర్లను నగరవాసులు కొంత రెంట్ పే చేసి ఎలక్ట్రికల్ బైక్స్ ఉపయోగించవచ్చు. మనం ప్రయాణించే దూరాన్ని బట్టి కొంత పే చేయాల్సి ఉంటుంది. పర్యావరణానికి ఎంతో అనుకూలమైన ఈ స్కూటర్లు, బైక్‌లతో కాలుష్యం తగ్గడంతో పాటు టైమ్‌తో పాటు మనీ కూడా సేవ్ కానున్నాయి. ఫ్యూచర్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌‌కు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ-వెహికల్స్ వల్ల రానున్న తరాలకు మంచి ఆరోగ్యకరమైన పర్యావరణం భవిష్యత్తు తరాలకు అందించి వాళ్ల మవుతామని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షెకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Fighter Movie, Tollywood, Vijay Devarakonda

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు