మహేష్ బాబు, ప్రభాస్‌లకు సవాల్ విసురుతున్న విజయ్ దేవరకొండ..

టాలీవుడ్ అగ్రహీరోలైన మహేష్ బాబు, ప్రభాస్‌లకు అసలు సిసలైన సవాల్ విసురుతున్నాడు విజయ్ దేవరకొండ. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: January 2, 2020, 11:07 AM IST
మహేష్ బాబు, ప్రభాస్‌లకు సవాల్ విసురుతున్న విజయ్ దేవరకొండ..
మహేష్,ప్రభాస్‌లకు విజయ్ దేవరకొండ సవాల్ (Twitter/Photo)
  • Share this:
టాలీవుడ్ అగ్రహీరోలైన మహేష్ బాబు, ప్రభాస్‌లకు అసలు సిసలైన సవాల్ విసురుతున్నాడు విజయ్ దేవరకొండ. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’ ఓవర్ నైట్ పాపులర్ అయిపోయాడు. దీంతో విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ ‌క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందంటే.. బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ లాంటి హీరోయిన్స్ కూడా విజయ్ ఆటిట్యూట్‌కు ఫిదా అయిపోయారు. చాలా తక్కువ సమయంలో అగ్ర హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ కేవలం సినిమాలకే పరిమిత కాకుండా.. వ్యాపార రంగంలో కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే ‘రౌడీ’ బ్రాండ్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా అర్జున్ రెడ్డి మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంటర్ కాబోతున్నాడు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఈ వ్యాపారం చేయబోతున్నాడు. ఏవీడీ పేరుతో మహబూబర్ నగర్‌లో ఫస్ట్ మల్టీప్లెక్స్‌ను త్వరలో ఓపెన్ చేయబోతున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు.. AMB సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్‌‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. హైదరాబాద్‌ సినీ ప్రియులకు ఇపుడు ఈ మల్టీప్లెక్స్ టూరిస్ట్ స్పాట్‌గా మారింది. మరోవైపు ప్రభాస్..తన మిత్రుడు వంశీ, ప్రమోద్‌లతో కలిసి నెల్లూరులో దేశంలోనే అతిపెద్ద ‘వీ ఎపిక్’ పేరుతో మల్టీప్లెక్స్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా వీళ్లిద్దరి బాటలో విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లో ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 2, 2020, 11:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading