Pawan Kalyan - Vijay Devarakonda: పవన్ కళ్యాణ్ సినిమాతో విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ ఓపెనింగ్.. సొంతూరిలోనే బిజినెస్..

పవన్ కళ్యాణ్ విజయ్ దేవరకొండ (Pawan Kalyan Vijay Devarakonda)

Pawan Kalyan - Vijay Devarakonda: ఈ రోజుల్లో హీరోలు బిజినెస్‌పై కూడా ఫోకస్ చేస్తున్నారు. అక్కడా ఇక్కడా రెండు చేతులా సంపాదిస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఇదే చేస్తున్నాడు. చాలా రోజులుగా ఈయన సినిమాలు మాత్రమే కాదు బిజినెస్..

  • Share this:
ఈ రోజుల్లో హీరోలు బిజినెస్‌పై కూడా ఫోకస్ చేస్తున్నారు. అక్కడా ఇక్కడా రెండు చేతులా సంపాదిస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఇదే చేస్తున్నాడు. చాలా రోజులుగా ఈయన సినిమాలు మాత్రమే కాదు బిజినెస్ కూడా చేస్తున్నాడు. రౌడీ వేర్ అంటూ క్లోత్స్ షోరూం మొదలుపెట్టి.. ఆన్‌లైన్‌లో అదరగొట్టాడు విజయ్. దాంతో పాటు మరిన్ని బిజినెస్‌లతో బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఈయన మల్టీప్లెక్స్ రంగంలోకి కూడా అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఈయన AMB సినిమాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ థియేటర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ మొదలు పెట్టాడు. ఈయన తాజాగా ఏషియన్ సినిమాస్‌తో కలిసి మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నాడు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని తిరుమల థియేటర్‌ను పూర్తిగా మోడిఫై చేసి దాన్ని AVD సినిమాస్‌గా మార్చేసారు. అంటే ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ అని అర్థం. మహబూబ్‌నగర్‌లోనే ఎందుకు అనే అనుమానం రావచ్చు.. దానికి కూడా కారణం ఉంది. విజయ్ దేవరకొండ సొంతూరు పాలమూరు జిల్లానే. అక్కడి అచ్చంపేటలోనే ఆయన పుట్టి పెరిగాడు. తన తండ్రి గోవర్ధన్ దేవరకొండ అచ్చంపేటలోనే ఉండేవాడు. ఆ తర్వాత కెరీర్ కోసం హైదరాబాద్ వచ్చాడు. దాంతో సొంత జిల్లాలోనే ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్ మొదలు పెట్టాడు విజయ్ దేవరకొండ.
Pawan Kalyan,Pawan Kalyan twitter,Pawan Kalyan vakeel saab,Vijay Devarakonda,Vijay Devarakonda multiplex,Vijay Devarakonda AVD cinemas,Vijay Devarakonda multiplex vakeel saab movie opening,AVD cinemas Vijay Devarakonda mahabubnagar,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ బిజినెస్,విజయ్ దేవరకొండ AVD సినిమాస్ వకీల్ సాబ్ సినిమాతో ప్రారంభం
వకీల్ సాబ్ సినిమా (Vakeel Saab movie)

ఈ థియేటర్‌ను పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మొదలు పెట్టాలని చూస్తున్నాడు ఈయన. ఓపెనింగ్‌కు విజయ్ దేవరకొండ రానున్నాడు. ఎప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది. అప్పుడే తన మల్టీప్లెక్స్ కూడా ఓపెన్ చేయనున్నాడు. ఇప్పటికే థియేటర్ మోడిఫై దాదాపు చివరి దశకు వచ్చేసింది. మొత్తానికి చూడాలి మరి.. విజయ్ దేవరకొండ ఈ మల్టీప్లెక్స్ బిజినెస్‌లో ఎంతవరకు రాణిస్తాడో..?
Published by:Praveen Kumar Vadla
First published: