Home /News /movies /

VIJAY DEVARAKONDA DIL RAJU SHIVA NIRVANA PROJECT OFFICIALLY ANNOUNCED TA

దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ క్రేజీ సినిమా...

విజయ్ దేవరకొండ,దిల్ రాజు,శివ నిర్వాణ ప్రాజెక్ట్ అనౌన్స్ (Twitter/Photo)

విజయ్ దేవరకొండ,దిల్ రాజు,శివ నిర్వాణ ప్రాజెక్ట్ అనౌన్స్ (Twitter/Photo)

తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించాడు. హీరోగా విజయ్ దేవరకొండకు ఇది 12వ చిత్రం.

‘పెళ్లిచూపులు’ సినిమాతో అందరి  దృష్టిలో పడ్డ విజయ్ దేవరకొండ...ఆ తర్వాత సందీప్ వంగా డైరెక్షన్‌లో చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. అంతేకాదు ఈ మూవీలో నటనకు గాను ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు. ఆ తర్వాత ‘మహానటి’, ‘గీతా గోవిందం’ ‘టాక్సీవాలా’ వంటి  సక్సెస్‌ ఫుల్ సినిమాలతో టాలవుడ్ మోస్ట్ బిజీయోస్ట్ హీరో అయిపోయాడు. ఈ యేడాది ఎన్నో అంచనాల మద్య విడులైన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అంతకు ముందు ‘నోటా’ పరిస్థితి కూడా ఇదే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే యేడాది ఫిబ్రవరి 14న విడుదల కానుంది. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో  దిల్ రాజు ఈ సినిమాను తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించాడు. హీరోగా విజయ్ దేవరకొండకు ఇది 12వ చిత్రం.


ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో పాటు రెండు చిత్రాలు చేస్తున్నాడు. ఇక శివ నిర్వాణ రీసెంట్‌గా నాని హీరోగా ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. వీళ్లిద్దరు ఆయా ప్రాజెక్టులు కంప్లీటైన తర్వాత  ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ చేయబోయే సినిమా కూడా ప్యూర్ లవ్ స్టోరీ అని చెబుతున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Dil raju, Shiva Nirvana, Telugu Cinema, Tollywood, Vijay Devarakonda

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు