Home /News /movies /

VIJAY DEVARAKONDA DECIDES TO FLY TO BANGKOK SR

Vijay Devarakonda : బ్యాంకాంక్‌ వెళ్తున్న విజయ్ దేవరకొండ..

విజయ్ దేవరకొండ (File/Photo)

విజయ్ దేవరకొండ (File/Photo)

Vijay Devarakonda : ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆర్నెల్ల తర్వాత ఇటీవలే మళ్లీ టాలీవుడ్ లో సినిమాల షూటింగులు మొదలయ్యాయి.

  \టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తున్న చిత్రం ఫైటర్. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది ఈ సినిమా. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో భాగంగా ముంబైలో 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఆ తర్వాత షెడ్యూల్ కూడా ముంబైలోని ధారవిలో జరగాల్సీవుండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అంతేకాదు ప్రస్తుతం పరిస్థితులు కొంత సర్దుకున్న అక్కడ షూటింగ్ జరుపుకునే అవకాశం లేదు. దీంతో ఆ ప్రణాళికను చిత్రబృందం మార్చుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న నగరాలలో ముంబై ఒకటి. లాక్ డౌన్ ముగిసినప్పటికీ అక్కడ షూటింగ్ చేయడం శ్రేయస్కరం కాదని పూరి భావిస్తుందట చిత్రబృందం.

  ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆర్నెల్ల తర్వాత ఇటీవలే మళ్లీ టాలీవుడ్ లో సినిమాల షూటింగులు మొదలయ్యాయి. అందులో భాగంగా కొందరు స్టార్ హీరోలు హైదరాబాదులో తమ సినిమాల షూటింగుల్లో పాల్గొంటున్నారు. మరికొందరు అవుట్ డోర్ షూటింగులకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా తన సినిమా షూటింగుకి రెడీ అవుతున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగును త్వరలోనే విదేశాలలో జరుపనున్నారని సమాచారం. ఈ సినిమా దర్శకుడు పూరి తన ఫేవరైట్ కంట్రీ బ్యాంకాక్ లో ఈ సినిమా షూటింగ్’ను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాడట. దాని కంటే ముందు.. హైదరాబాద్ లో నిర్మించిన ఓ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ రిస్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఫైటర్‌ కోసం ప్రత్యేకంగా వేసిన బాక్సింగ్ సెట్ లో విజయ్ దేవరకొండ పై కొన్ని ఫైట్ సీన్ షూట్ చేస్తారట. అయితే కరోనా కారణంగా ఏర్పడ్డ ఈ గ్యాప్’ను పూర్తి చేయడానికి పూరి ఇక ఏకధాటిగా షూటింగ్‌ను నిర్వహించనున్నాడట.

  ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఎప్పటినుండో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనీ అనుకుంటున్న విజయ్‌కు ఈ సినిమా మంచి అవకాశం ఉండనుంది. మరోవైపు పూరి కూడా ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఎంతవరకూ ఆ అంచనాలను అందుకుంటుందో. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఇక సినిమాల విషయం అలా ఉంటే విజయ్ దేవరకొండ ఇటీవల ఓ ఇంటర్వూలో పేద వారికి ఓటు హక్కు రద్దు చేయాలనీ పేర్కోనడం వివాదస్పదమవుతోంది. అంతేకాదు ఆయన ఇంటర్వూలో దేశంలో డిక్టేటర్ షిప్ ఉండాలనీ కోరాడు. దీంతో కొందరు నెటిజన్స్ ఆయనపై మండి పడుతున్నారు. అవగాహాన లేకపోతే మాట్లాడవద్దంటూ సలహాలు ఇస్తున్నారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Tollywood news, Vijay Devarakonda

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు