విజయ్ దేవరకొండ కొత్త రికార్డ్.. హిందీలో దుమ్మురేపుతున్నకామ్రేడ్..

తెలుగులో ఫ్లాపైన ఈ మూవీ హిందీలో మాత్రం ఊపేస్తోంది. డియర్ కామ్రేడ్‌పై హిందీ ప్రేక్షుకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. సినిమా స్టోరీతో పాటు విజయ్ యాక్టింగ్, విజయ్-రష్మిక రొమాన్స్ అదిరిపోయిందంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.


Updated: January 21, 2020, 4:38 PM IST
విజయ్ దేవరకొండ కొత్త రికార్డ్.. హిందీలో దుమ్మురేపుతున్నకామ్రేడ్..
డియర్ కామ్రేడ్ పోస్టర్ Photo: twitter
  • Share this:
విజయ్ దేవరకొండకు యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అర్జున్ రెడ్డి సినిమాతో మనోడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఎక్కడికో వెళ్లిపోయాడు. టాలీవుడ్ రౌడీ‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలు సైతం హిట్ కావడంతో విజయ్‌ కోసం నిర్మాతలు క్యూకట్టారు. ఐతే గత ఏడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడలో రిలీజ్ చేసినప్పటికీ సక్సెస్ కాలేదు. డియర్ కామ్రేడ్ ఘోరంగా విఫలమవడంతో విజయ్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

తెలుగులో ఫ్లాపైన ఈ మూవీ హిందీలో మాత్రం ఊపేస్తోంది. డియర్ కామ్రేడ్‌ చిత్రాన్ని హిందీ ప్రేక్షుకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. సినిమా స్టోరీతో పాటు విజయ్ యాక్టింగ్, విజయ్-రష్మిక రొమాన్స్ అదిరిపోయిందంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. జనవరి 19న యూబ్యూబ్‌లో విడుదలైన డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్ వర్షన్ రికార్డుల మోత మోగిస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే 12 మిలియన్లు (కోటి 20 లక్షల) వ్యూస్ సాధించిది డియర్ కామ్రేడ్.
భరత్‌ కమ్మ​ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్ర తెలుగులో గత ఏడాది జులై 26న విడదలయింది. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి, రవి శంకర్, యశ్‌ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించారు. డియర్ కామ్రేడ్ పాటలకు మంచి స్పందన వచ్చినప్పటికీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.
First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు