‘డియ‌ర్ కామ్రేడ్’ హిందీలో రీమేక్.. క‌న్ఫ‌ర్మ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల‌కు ఇప్పుడు తెలుగులోనే కాదు అన్ని భాష‌ల్లోనూ ఇమేజ్ ఉంది. అర్జున్ రెడ్డి పుణ్య‌మా అని ఈయ‌న అన్ని చోట్లా త‌న మార్కెట్ పెంచుకున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 23, 2019, 8:12 PM IST
‘డియ‌ర్ కామ్రేడ్’ హిందీలో రీమేక్.. క‌న్ఫ‌ర్మ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..
డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్
  • Share this:
విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల‌కు ఇప్పుడు తెలుగులోనే కాదు అన్ని భాష‌ల్లోనూ ఇమేజ్ ఉంది. అర్జున్ రెడ్డి పుణ్య‌మా అని ఈయ‌న అన్ని చోట్లా త‌న మార్కెట్ పెంచుకున్నాడు. దీన్ని పెంచుకోడానికి ఇప్పుడు డియర్ కామ్రేడ్ సినిమాను నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో విడుదల చేస్తున్నారు. ప్ర‌మోష‌న్స్ కూడా ఇదే స్థాయిలో జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు విడుద‌ల‌కు ముందే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌డానికి స్టార్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ ఆస‌క్తి చూపిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడు ఈ ద‌ర్శ‌క నిర్మాత‌.

తాజాగా ఇదే విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేస్తూ క‌ర‌ణ్ జోహార్ కూడా ట్వీట్ చేసాడు. విడుద‌ల‌కు ముందే డియ‌ర్ కామ్రేడ్ చూసాను.. నాకు న‌చ్చింది.. మీకు కూడా న‌చ్చుతుందనే భావిస్తున్నాను.. అందుకే రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాను అంటూ ట్వీట్ చేసాడు ఈయ‌న‌. క‌ర‌ణ్ జోహార్‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మైత్రి మూవీ మేక‌ర్స్ న‌వీన్, బిగ్ బెన్ సినిమాస్ య‌శ్ రంగినేని ఉన్నారు. జులై 26న డియ‌ర్ కామ్రేడ్ సినిమా విడుద‌ల కానుంది. మొత్తానికి తెలుగులోనే ఇంకా విడుద‌ల కాని డియ‌ర్ కామ్రేడ్ హిందీలో ఎలాంటి ఫ‌లితం తీసుకొస్తుందో చూడాలి.First published: July 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు