విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్.. కరణ్ జోహార్‌కు తప్పని షాక్..
విజయ్ దేవరకొండకు చాలా రోజుల తర్వాత వచ్చిన డిజాస్టర్ డియర్ కామ్రేడ్. ఈ చిత్రాన్ని భరత్ కమ్మ తెరకెక్కించాడు. మూడు వారాల కింద వచ్చిన ఈ చిత్రం ఊహించిన ఫలితం సాధించలేదు.

డియర్ కామ్రేడ్ పోస్టర్ (Source: Twitter)
- News18 Telugu
- Last Updated: August 17, 2019, 4:02 PM IST
విజయ్ దేవరకొండకు చాలా రోజుల తర్వాత వచ్చిన డిజాస్టర్ డియర్ కామ్రేడ్. ఈ చిత్రాన్ని భరత్ కమ్మ తెరకెక్కించాడు. మూడు వారాల కింద వచ్చిన ఈ చిత్రం ఊహించిన ఫలితం సాధించలేదు. దాంతో సినిమాను ప్రమోట్ చేయడం కూడా మానేసాడు విజయ్. విడుదలకు ముందు హీరోయిన్ రష్మిక మందన్నతో కలిసి అన్ని రాష్ట్రాలు తిరిగిన ఈయన రిలీజ్ తర్వాత మాత్రం పట్టించుకోవడం మానేసాడు. దానికితోడు సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ కావడంతో ప్రమోషన్ చేసినా ఒరిగిదేం ఉండదని ముందే గ్రహించాడు విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌కు కష్టంగా మారింది.

ఈ సినిమా చూసి విజయ్ దేవరకొండపై ఉన్న నమ్మకంతో సినిమా రిమేక్ రైట్స్ తీసుకున్నాడు. డియర్ కామ్రేడ్ తనకు బాగా నచ్చిందని చెప్పాడు ఈ దర్శకుడు. తానే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించాడు కూడా. అయితే హీరో ఎవరు అనేది మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. ఇదిలా ఉంటే డియర్ కామ్రేడ్ ఫలితం చూసిన తర్వాత ఏ హీరో కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. దాంతో రీమేక్ రైట్స్ తీసుకున్నంత ఈజీగా హీరోను పట్టుకోలేకపోతున్నాడు కరణ్ జోహార్. మరి చివరికి డియర్ కామ్రేడ్ రీమేక్ పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి.

డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్