అక్కడ అదరగొడుతోన్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్...

Dear Comrade in amazon prime : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన  చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఇటీవలే నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో విడుదలైన ఈ సినిమా... భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

news18-telugu
Updated: August 30, 2019, 12:05 PM IST
అక్కడ అదరగొడుతోన్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్...
thedeverakonda/Instagram
  • Share this:
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన  చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఇటీవలే నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో విడుదలైన ఈ సినిమా...భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే హిందీలో రీమేక్ చేయ‌డానికి హిందీ పాపులర్  డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ ఆస‌క్తి చూపించారు. ఈ క్ర‌మంలోనే రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా విడుదలకు ముందే ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. హిందీలో ఈ సినిమా కోసం షాహిద్‌ కపూర్‌ను ఎంపికచేసుకోవాలని కరణ్‌ భావించారని, అంతేకాదు.. ఈ సినిమా కోసం షాహిద్‌ ఏకంగా రూ.40 కోట్లు అడిగినట్లు.. ఆ డిమాండ్‌కు కరణ్ కూడా ఓకే అన్నట్టు  వార్తలొచ్చాయి. 

View this post on Instagram
 

This Sunday. The 12th of May. You will experience what I call "The Song of the Year" #DearComrade


A post shared by Vijay Deverakonda (@thedeverakonda) on

అయితే ఇటీవల విడుదలైన 'డియర్ కామ్రేడ్' అనుకున్నంతగా అలరించలేదు.. దీంతో హిందీలో ఈ సినిమా రీమేక్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అనే సందేహంతో షాహిద్ వెనుకకు తగ్గినట్లు తెలుస్తోంది.  అది అలా ఉంటే డియర్ కామ్రేడ్ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్  ప్రైమ్ దక్కించుకుంది. సరిగ్గా సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. దీంతో విజయ్ అభిమానులు సినిమాను మరోసారి చూస్తూ.. ట్వీటర్‌లో కామెంట్స్ పెడుతుండడంతో ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' ట్వీటర్‌లో ట్రెండ్ అవుతోంది.First published: August 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు