ఓవైపు నటనలో శిఖరాలు దాటుతూనే అభిమానులకి వీలైనంత ప్రేమని అందిస్తూ ఉన్నాడు హీరో విజయ్ దేవరకొండ (Vijay devarakonda). ప్రతి సంవత్సరం దేవర సాంటాగా (Devara Santa) మారి తన అభిమానులకి సంతోషాన్ని పంచే విజయ్ ఈ సంవత్సరం 100 మందికి జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలు అందించాడు. తన స్నేహితులతో చిన్నప్పుడు ట్రిప్ కి వెళ్లిన స్మృతులని గుర్తుచేసుకుంటూ తన దగ్గర సరైన సంపాదన లేనప్పుడు ఆ ట్రిప్ కి తన స్నేహితులు తనని తీసుకెళ్లడం ఎంత సంతోషాన్నిచ్చిందో చెప్పాడు.
అలాంటి సంతోషాన్ని పంచాలనే ఎంపిక చేయబడిన 100 మంది సామాన్యులని తన సొంత ఖర్చు తో మనాలి ట్రిప్ కి తీసుకెళ్లడమే కాకుండా తన తల్లితండ్రులతో పాటు వెళ్లి వారితో సమయం గడిపాడు.తాజాగా ఆ ట్రిప్ కి సంబంధించిన గ్లింప్స్ ని విజయ్ తన హ్యాండిల్ లో పోస్ట్ చేయగా అందులో, ట్రిప్ లో భాగమైన ఆనందం, విజయ్ మీద తమ ప్రేమ, కృతజ్ఞత, తమ జీవితం లో ఈ ట్రిప్ ఎంత ముఖ్యమో తెలియజేసారు. చివర్లో అందరూ ఎమోషనల్ అయి విజయ్ ని హగ్ చేసుకోవడం ఆ 100 మంది ఒకరికొకరు ఎమోషనల్ గా దగ్గరవ్వడం చూడచ్చు.
A 100 of you went, made friends, memories and experiences which will stay ❤️ When I see your happy smiling emotional faces, I know why I do this! I love you all ???? Full Love, Vijay Deverakonda. #Deverasanta2022 https://t.co/9mU3pqoejL https://t.co/IKcmbx9QCO
— Vijay Deverakonda (@TheDeverakonda) February 27, 2023
ఇటీవలే లైగర్ సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న విజయ్ దేవరకొండ .. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఉన్న యూనిట్.. ఈ సినిమా ఇప్పటికే ఓ రెండు షెడ్యూల్స్ షూటింగ్ ఫినిష్ చేశారు.
అయితే ఆ తర్వాత సమంత ఆరోగ్య కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా కొత్త షెడ్యూల్ మార్చి మొదటి వారం నుంచి షురూ కానుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.