ప్రస్తుతం కరోనా ప్రపంచమే స్థంభించిపోయింది. మన దేశంలో ఈ వైరస్ ఉదృతిని కట్టడి కాకపోవడంతో మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కరోనా లాక్‌డౌన్ కారణంగా పనిలేకుండా పోయిన వాళ్లకు సినిమా నటులు, సెలబ్రిటీలతో పాటు వివిధ సంస్థలు, వ్యక్తులు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నటులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తమ వంతుగా సాయం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ కరోనాపై తన వంతుగా ప్రజలకు సలహాలు సూచనలు ఇస్తున్నాడు. పోలీసులకు తన వంతుగా సహాయ సహకారాలు అందించాడు. అంతేకాదు విజయ్ దేవరక ొండ.. బీ ది రియల్ మేన్ ఛాలెంజ్ వంటివి స్వకరించి ఇంట్లో పనులను కూడా చేసాడు. కానీ ఇప్పటి వరకు తన వంతు విరాళం ప్రకటించలేదు. దీనిపై విమర్శలు వచ్చాయి. తాజాగా విజయ్ దేవరకొండ లేట్‌గా అయినా.. లేటెస్ట్‌గా కరోనా పై పోరాటంలో రూ. కోటి ముప్పై లక్షల విరాళం ప్రకటించాడు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో సామాన్యులకు సాయం అందించడానికి రెండు ఛారిటీ సంస్థలను ఏర్పాటు చేసి తనదైన ముద్ర వేసుకున్నాడు.
2 Big Important Announcements! ❤️🤗https://t.co/5n1pnJRCae
Full details at https://t.co/AzYE7kSgsJ#TDF #MCF pic.twitter.com/MVzFbdlXzP
— Vijay Deverakonda (@TheDeverakonda) April 26, 2020
ఏది చేసినా విభిన్నంగా ఉండేలా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా కరోనా వైరస్ సంక్షోభంతో దుర్భర పరస్థితులును ఎదుర్కొంటున్న సామాన్యులకు అందించడానికి ముందుకొచ్చాడు. దీని కోసం రెండు చారిటీ సంస్థలను ఏర్పాటు చేసాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం రూ. 25 లక్షల రూపాయలతో మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసాడు. అలాగే యూత్‌కు ఎంప్లాయిమెంట్ కోసం ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఎవరికైనా నిత్యావసరలు లేక అవస్థలు పడుతున్న వారి కోసం https://thedeverakondafoundation.org లాగిన్ అయి తమ వివరాలు నమోదు చేసుకుంటే వాళ్ల వాలంటీర్లే స్వయంగా సభ్యులకు నిత్యావసరాలు అందిస్తారట. దాదాపు 2 వేల కుటుంబాలకు సంబంధించిన అవసరాలను ఎం.సి.ఎఫ్ ట్రస్ట్ తీర్చే విధంగా దీన్ని రూపకల్పన చేసారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Telugu Cinema, Tollywood, Vijay Devarakonda