‘బి ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ పూర్తి చేసిన విజయ్ దేవరకొండ..

ప్రస్తుతం అన్ని సినీ ఇండస్ట్రీస్‌లో కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని రద్దైయాయి. దీంతో సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. తాజాగా విజయ్ దేవరకొండ కొరటాల శివ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి ఇంట్లో పనులు చేసాడు.

news18-telugu
Updated: April 25, 2020, 12:37 PM IST
‘బి ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ పూర్తి చేసిన విజయ్ దేవరకొండ..
విజయ్ దేవరకొండ (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం అన్ని సినీ ఇండస్ట్రీస్‌లో కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని రద్దైయాయి. దీంతో సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. తాజాగా ఛాలెంజ్‌లో భాగంగా కొరటాల శివ ..  బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌కు విజయ్ దేవరకొండను నామినేట్ చేసారు. దీంతో విజయ్ దేవరకొండ కొరటాల శివ ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసాడు. అంతేకాదు ఇంట్లో పనులు చేసాడు. ఈ సందర్భంగా ఇల్లు ఊకడంతో పాటు బాసాన్లు తోమడం.. బట్టలు వాషింగ్ మిషన్‌లో వేయడంతో  ఇంట్లో తమ్ముడికి అమ్మకు తాను చేసిన వంటను తినిపించాడు. ఈ చాలెంజ్‌కు మహానటిలో తనతో కలిసి యాక్ట్ చేసిన దుల్కర్ సల్మాన్‌కు ఈ  ఛాలెంజ్ విసిరాడు. ఇక దుల్కర్ ఈ ఛాలెంజ్‌ను ఏ రకంగా చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ యేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా అందరితో పాటు విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే కదా.

Published by: Kiran Kumar Thanjavur
First published: April 25, 2020, 12:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading