Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /సినిమా /

Vijay Devarakonda:ముంబై నా ఇల్లు అని ఫీలయ్యా.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్

Vijay Devarakonda:ముంబై నా ఇల్లు అని ఫీలయ్యా.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్

విజయ్‌ దేవరకొండ హీరోగా రాబోతున్న కొత్త సినిమా లైగర్. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్‌ ముంబైని తాకింది.

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా రాబోతున్న కొత్త సినిమా లైగర్ (Liger). పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్‌ ముంబైని తాకింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. దీంతో బాలీవుడ్ స్టార్స్ కు పోటీ ఇచ్చే లెవెల్‌లో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ కనిపిస్తోంది. ఈ క్రమంలో ముంబైలో తనకు ఆడియన్స్ ఇస్తున్న ప్రియారిటీపై ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ని ఇటీవల ముంబైలోని అంథేరీ సినీపోలీస్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో లైగర్‌ టీమ్‌ మొత్తం పాల్గొనగా.. విజయ్‌ దేవరకొండను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ‘రౌడీ రౌడీ’అంటూ నినాదాలు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను పూరీ కనెక్ట్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ముంబై సీనీ పోలీస్‌ మాస్‌ థియేటర్‌గా మారిన వేళ అన్నట్లుగా క్యాప్షన్‌ పెట్టారు. దీంతో దీనిపై విజయ్‌ స్పందిస్తూ.. ముంబై నా నివాసంగా ఫీలైన క్షణాలివే అని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.

ఇప్పటిదాకా టాలీవుడ్ రౌడీ స్టార్ గా పిలిపించుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ కాబోతున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. విజయ్- అనన్య స్క్రీన్ ప్రెజెన్స్ యువతకు పిచ్చెక్కిచందట. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఓ వైపు షూటింగ్ చేస్తూనే ఈ సినిమా నుంచి వదులుతున్న ఒక్కో అప్ డేట్ సినిమాపై హైప్ పెంచేస్తోంది. విజయ్ దేవరకొండ- పూరి కాంబో కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైస‌న్ (Mike Tyson) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రియ‌ల్ లైఫ్‌ బాక్సర్ అయిన ఆయన కెమెరా ముందు బాక్సింగ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా కథ ప్రకారం మైక్ టైసన్ నుంచి స్ఫూర్తి పొందిన యువ‌కుడిగా విజయ్ దేవరకొండ క‌నిపిస్తార‌ట‌. ఆగస్ట్‌ 25న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

First published:

Tags: Liger, Puri Jagannadh, Vijay Devarakonda

ఉత్తమ కథలు