‘దొరసాని’ ట్రైలర్ టాక్.. మరో తోట రాముడి కథ..

ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ క్రేజ్‌తోనే ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన లక్‌ను పరీక్షించుకోబోతున్నాడు. ఈయన తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా ‘దొరసాని. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

news18-telugu
Updated: July 1, 2019, 11:07 AM IST
‘దొరసాని’ ట్రైలర్ టాక్.. మరో తోట రాముడి కథ..
దొరసాని చిత్రంలో శివాత్మిక
  • Share this:
ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ క్రేజ్‌తోనే ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన లక్‌ను పరీక్షించుకోబోతున్నాడు. ఈయన తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా ‘దొరసాని. ఈ సినిమాతో కేవీఆర్ మహేంద్ర అనే దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. పక్కా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కతోన్న సినిమా ఇది.  పైగా చిన్న సినిమాల‌కు అండ‌గా ఉండే సురేష్ బాబు దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదే సినిమాతో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్‌‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.ఈ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో రెండు ఫ్యామిలీలకు చెందిన వారసులు ఎంట్రీ ఇవ్వనుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్‌తో ఈ సినిమా పై అంచనా పెరిగాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు.

ఈ ట్రైలర్‌ చూస్తుంటే.. అప్పట్లో ఎన్టీఆర్ నటించిన ‘పాతాళ బైరవి’ సినిమాలోని తోటరాముడు గుర్తుకు తెస్తోంది. కానీ అది జానపద సినిమా.  ఈ సినిమాను  స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పల్లె నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు అన్ని సినిమాల్లో లాగే గొప్పింటి అమ్మాయిని..పేదింటి అబ్బాయి ప్రేమించుకుంటారు. వీళ్ల ప్రేమను పెద్దలు అంగీకరించారు. ఈ సందర్భంగా వీళ్ల ప్రేమను  పెద్దలు అంగీకరించరు.  ఆ తర్వాత ఏం జరిగిందనేదే ‘దొరసాని’ సినిమా స్టోరీ. అప్పటి తెలంగాణ సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి. అప్పట్లో తెలంగాణ యువత ఎందుకు నక్సలైట్స్‌గా మారుతారనేది ఈ సినిమాలో చూపెట్టారు. మ‌రి ఈ చిత్రంతో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు హీరోయిన్‌గా రాజశేఖర్ కూతురు శివాత్మిక స‌క్సెస్ ఫుల్‌గా లాంఛ్ అవుతారో  లేదో..? చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 1, 2019, 11:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading