Pushpaka Vimanam 1st day collections: ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ ఫస్ట్ డే కలెక్షన్స్..
పుష్పక విమానం కలెక్షన్స్ (Pushpaka Vimanam collections)
Pushpaka Vimanam 1st day collections: మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో గతేడాది ఓటిటిలో మంచి విజయం అందుకున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda Pushpaka Vimanam 1st day collections). విజయం ఇచ్చిన ఉత్సాహంలో వరస సినిమాలు చేస్తున్నాడు జూనియర్ దేవరకొండ.
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో గతేడాది ఓటిటిలో మంచి విజయం అందుకున్నాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. విజయం ఇచ్చిన ఉత్సాహంలో వరస సినిమాలు చేస్తున్నాడు జూనియర్ దేవరకొండ. ఈ క్రమంలోనే ఆయన నటించిన తాజా చిత్రం ‘పుష్పక విమానం’. నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. టీజర్, ట్రైలర్ అంతా పెళ్లికి సంబంధించినట్లు చూపించి.. సినిమాలో మాత్రం పూర్తిగా మర్డర్ మిస్టరీ చూపించాడు దర్శకుడు దామోదర. ఇక్కడే ప్రేక్షకులకు షాక్ తగిలింది.. దాంతో సినిమాకు కూడా అదే మైనస్ అయింది. ఒకటి అనుకుని వస్తే.. మరోటి చూపించారేంటి అనేది అంటూ ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. ఇదే పుష్పక విమానం సినిమాకు నెగిటివ్ అయిపోయింది. గీత్ సైని, శాన్వీ మేఘన హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు దామోదర తెరకెక్కించాడు. విజయ్ దేవరకొండ సొంత బ్యానర్ ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్టైన్మెంట్స్, ‘టాంగా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇప్పుడు బయటికి వచ్చాయి.
‘పుష్పక విమానం’ సినిమాను రూ.2.2 కోట్లకు అమ్మారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రెండున్నర కోట్లు రావాల్సిందే. మొదటి రోజు కేవలం 45 లక్షలు మాత్రమే వసూలు చేసింది పుష్పక విమానం. పైగా రెండో రోజు చాలా చోట్ల సినిమాకు వసూళ్లు ఆశాజనకంగా లేవు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆనంద్ దేవరకొండ సినిమా సేఫ్ అవ్వడం అసాధ్యమే. వీకెండ్ మ్యాజిక్ జరిగితేనే ఇదంతా సాధ్యమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదంతా జరుగుతుందా అనేది ఆసక్తికరమే.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.