మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్‌లకు ముందు విజయ్ దేవరకొండ ఖాతాలో ఆ రికార్డు...

విజయ్ దేవరకొండ,మహేష్, ప్రభాస్, బన్ని (file/photos)

Vijay Devarakonda Beats Mahesh babu Prabhas Allu Arjun | మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్‌లకు ముందు విజయ్ దేవరకొండ ఖాతాలో ఆ రికార్డు నమోదైంది.

 • Share this:
  మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్‌లకు ముందు విజయ్ దేవరకొండ ఖాతాలో ఆ రికార్డు నమోదైంది. అవును టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మహేష్ బాబు,ప్రభాస్, అల్లు అర్జున్‌ల కంటే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్ దేవరకొండను ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్ ఫాలోవర్స్‌ను క్రాస్ చేసాడు. అంటే విజయ్ దేవరకొండను ఇన్‌స్టాలో కోటి మంది ఫాలో అవుతున్నారన్నమాట. దీంతో సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు. విజయ్ దేవరకొండ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో 9.8 మిలియన్ ఫాలోవర్స్‌తో అల్లు అర్జున్ రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఆ తర్వాత  ఇన్‌స్టాగ్రామ్‌లో 6.1 ఫాలోవర్స్‌తో మహేష్ బాబు మూడో ప్లేస్‌లో నిలిచారు.

  ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయానికొస్తే.. ఈయన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య 5.8 మిలియన్ ఫాలోవర్స్‌తో నాల్గో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 3.2 మిలియన్ ఫాలోవర్స్‌తో రామ్ చరణ్.. ఐదో స్థానంలో నిలిచారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మాత్రం 2.1 మిలియన్ ఫాలోవర్స్‌తో ఆరో స్థానంతో సరిపెట్టుకున్నారు. మొత్తంగా తెలుగులో విజయ్ దేవరకొండ అగ్ర హీరోలందరినీ  క్రాస్ చేయడం విశేషం. తెలుగులో ‘పెళ్లిచూపులు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకొని.. ‘అర్జున్ రెడ్డి’తో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు.


  ఆ తర్వాత ‘మహానటి’, ‘గీతా గోవిందం’ ‘టాక్సీవాలా’ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యేడాది ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో పలకరించిన విజయ్ దేవరకొండ.. ఈ యేడాది  ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో పలకరించాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘పైటర్’ మూవీ చేస్తున్నాడు. వచ్చే యేడాది ఈ సినిమా విడుదల కానుంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: