Home /News /movies /

VIJAY DEVARAKONDA BEETS MAHESH BABU ALLU ARJUN IN INSTAGRAM ACCOUNT TA

విజయ్ దేవరకొండ ధాటికి తట్టుకోలేకపోతున్న మహేష్, బన్ని..

విజయ్ దేవరకొండ,మహేష్ బాబు,అల్లు అర్జున్ (Facebook/Photos)

విజయ్ దేవరకొండ,మహేష్ బాబు,అల్లు అర్జున్ (Facebook/Photos)

టాలీవుడ్‌ టాప్ హీరోలైన మహేష్ బాబు, అల్లు అర్జున్ తట్టుకోలేకపోతున్నారు.

    టాలీవుడ్‌ టాప్ హీరోలైన మహేష్ బాబు, అల్లు అర్జున్ తట్టుకోలేకపోతున్నారు. అంతేకాదు వాళ్లను బీట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా టాలీవుడ్‌లో రికార్డు క్రియేట్ చేసాడు. తాజాగా విజయ్ దేవవరకొండ.. ఇన్‌స్టాగ్రామ్  ఖాతాలో 5 మిలియన్ ఫాలోవర్స్ చేరకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికొస్తే.. ఆయన ఇన్‌స్టా ఖాతాను 3.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అల్లు అర్జున్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 4.6 మిలియన్లు ఉన్నారు. తాజాగా విజయ్ దేవరకొండ వీళ్లందరినీ క్రాస్ చేయడం విశేషం. తెలుగులో ‘పెళ్లిచూపులు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకొని.. ‘అర్జున్ రెడ్డి’తో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘మహానటి’, ‘గీతా గోవిందం’ ‘టాక్సీవాలా’ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యేడాది ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో పలకరించిన విజయ్ దేవరకొండ.. వచ్చే యేడాది ఫిబ్రవరి 14న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో పలకరించబోతున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ala Vaikunthapurramloo, Allu Arjun, Mahesh babu, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood, Vijay Devarakonda, World Famous Lover

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు