రకుల్ ప్రీత్ సింగ్‌ మనసు కొల్లగొట్టిన సెన్సేషనల్ విజయ్ దేవరకొండ..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు ఓ డైలాగ్ చెప్తాడు గుర్తుందా.. ఈ మధ్య మన టైమ్ ఏంటో మనకే అర్థం కావట్లేదు.. చూసిన రెండు నిమిషాలకే పడిపోతుంది ప్రతీదీనూ అని.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 8, 2019, 10:48 AM IST
రకుల్ ప్రీత్ సింగ్‌ మనసు కొల్లగొట్టిన సెన్సేషనల్ విజయ్ దేవరకొండ..
రకుల్ ప్రీత్ సింగ్ విజయ్ దేవరకొండ ఫైల్ ఫోటోస్
  • Share this:
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు ఓ డైలాగ్ చెప్తాడు గుర్తుందా.. ఈ మధ్య మన టైమ్ ఏంటో మనకే అర్థం కావట్లేదు.. చూసిన రెండు నిమిషాలకే పడిపోతుంది ప్రతీదీనూ అని. ఇప్పుడు ఇదే డైలాగ్ విజయ్ దేవరకొండకు అప్లై అవుతుంది. ఈ హీరో అంటే మన హీరోయిన్లు పడి చచ్చిపోతున్నారు. ఈ మాటను ఓపెన్‌గా ఒప్పేసుకుంటున్నారు కూడా. ఇప్పటికే కియారా అద్వానీ అయితే తనకు విజయ్ అంటే పిచ్చి అని చెప్పింది. రామ్ చరణ్, రానా లాంటి హీరోలు పక్కనుండగానే తనను ఒక్కసారి విజయ్ దేవరకొండతో కలిపించండంటూ రిక్వెస్ట్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ విజయ్ దేవరకొండ ఫైల్ ఫోటోస్


ఆ తర్వాత ఇప్పుడు ఆయనతో కలిసి ఓ యాడ్ చేసింది. ఇక ఇప్పుడు రకుల్ కూడా విజయ్ దేవరకొండపై ఉన్న ప్రేమను చూపించింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితోనూ రొమాన్స్ చేసిన రకుల్.. మొన్నీమధ్యే నాగార్జున లాంటి సీనియర్స్‌తో కూడా కలిసి నటించింది. ఇప్పుడు తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తుంది రకుల్. ఇదిలా ఉంటే తనకు విజయ్ దేవరకొండ అంటే క్రష్ ఉందని చెప్పి సంచలనం సృష్టించింది రకుల్. తన ఫిజిక్ విషయంలో తీసుకునే జాగ్రత్తల గురించి కూడా చెప్పుకొచ్చింది ఈ భామ.

రకుల్ ప్రీత్ సింగ్ విజయ్ దేవరకొండ ఫైల్ ఫోటోస్


తిండి విషయంలో కడుపు కాల్చుకునే అలవాటు తనకు లేదని.. ఇష్టమైనవన్నీ తింటూనే దానికి సరిపడా జిమ్ చేస్తానని చెబుతుంది రకుల్. ఇక తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా చెప్పింది రకుల్. ఆరడుగుల ఎత్తుండాలని.. తెలివైన వాడై ఉండాలని.. అలాంటివాడు దొరికే వరకు ఎదురు చూస్తానని చెబుతుంది రకుల్. ఇక ఇప్పుడున్న హీరోల్లో తనకు విజయ్ దేవరకొండ అంటే పిచ్చి అని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్ డైరెక్టుగా ఆయనలా ఉంటే తనకు ఓకే అని కూడా హింట్ ఇచ్చేసింది రకుల్.
First published: October 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading