తమిళ్ "అర్జున్ రెడ్డి" లుక్.. ఎక్క‌డో తేడా కొడుతుంది "వ‌ర్మ‌"

తమిళనాట "వ‌ర్మ‌"గా వ‌స్తుంది అర్జున్ రెడ్డి. ఈ కారెక్ట‌ర్ కోసం ధృవ్ పిచ్చెక్కించేలా మేకోవ‌ర్ అయ్యాడు. మేఘాచౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తుంది. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. అయితే తెలుగులో "అర్జున్ రెడ్డి"గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను చూసిన క‌ళ్ల‌తో అక్క‌డ ధృవ్ విక్ర‌మ్‌ను చూడ‌లేక‌పోతున్నారు ప్రేక్ష‌కులు. పైగా లుక్ కూడా తేడాగా అనిపిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 22, 2018, 6:46 PM IST
తమిళ్
విజయ్ దేవరకొండ వర్మ
  • Share this:
"అర్జున్ రెడ్డి".. ఈ సినిమా గురించి చెప్ప‌డానికి మాట‌లు స‌రిపోవు. కొత్త ద‌ర్శ‌కుడు వ‌చ్చి ఇండ‌స్ట్రీ రూపురేఖ‌ల్ని మార్చేస్తాడ‌ని క‌నీసం ఎవ‌రూ ఊహించ‌లేదు కూడా. కానీ సందీప్ రెడ్డి దెబ్బ‌కు ట్రెండ్ క‌దిలిపోయింది. గ‌తేడాది విడుద‌లైన "అర్జున్ రెడ్డి" సెగ‌లు ఇంకా త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు ఈ చిత్రం త‌మిళ‌నాట రీమేక్ అవుతుంది. అక్క‌డ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ మ‌ధ్యే సినిమా షూటింగ్ కూడా పూర్తైపోయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో బిజీగా ఉంది సినిమా.

తమిళ్ "అర్జున్ రెడ్డి" లుక్.. ఎక్క‌డో తేడా కొడుతుంది "వ‌ర్మ‌".. vijay devarakonda arjun reddy tamil remake varma first look released..
వర్మ షూటింగ్ స్పాట్


కుదిర్తే ఇదే ఏడాది విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. అక్క‌డ "వ‌ర్మ‌"గా వ‌స్తుంది అర్జున్ రెడ్డి. ఈ కారెక్ట‌ర్ కోసం ధృవ్ పిచ్చెక్కించేలా మేకోవ‌ర్ అయ్యాడు. మేఘాచౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తుంది. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. అయితే తెలుగులో "అర్జున్ రెడ్డి"గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను చూసిన క‌ళ్ల‌తో అక్క‌డ ధృవ్ విక్ర‌మ్‌ను చూడ‌లేక‌పోతున్నారు ప్రేక్ష‌కులు. పైగా లుక్ కూడా తేడాగా అనిపిస్తుంది. ఈ లుక్ ఎందుకో ఈ కుర్ర హీరోకు సెట్ కాలేద‌నిపిస్తుంది.

తమిళ్ "అర్జున్ రెడ్డి" లుక్.. ఎక్క‌డో తేడా కొడుతుంది "వ‌ర్మ‌".. vijay devarakonda arjun reddy tamil remake varma first look released..
వర్మ పోస్టర్


బైక్‌పై హీరోయిన్ మేఘాను ఎక్కించుకుని రైడ్ చేస్తున్న ఫోటో విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఈ లుక్ మాత్రం ఆడియ‌న్స్‌కు కిక్ ఇవ్వ‌డం లేదు. అస‌లు "అర్జున్ రెడ్డి" అంటే ఎలా ఉంటాడు.. ఇందులో ధృవ్ ఎలా ఉన్నాడంటున్నారు అభిమానులు. బాల ద‌ర్శ‌కుడు కావ‌డంతో క‌చ్చితంగా తెలుగు కంటే మ‌రింత రా గా ఈ సినిమాను తెర‌కెక్కించి ఉంటాడ‌నే భావిస్తున్నారు ప్రేక్ష‌కులు. మ‌రి చూడాలిక‌.. ఫ‌స్ట్‌లుక్ విష‌యంలో అయితే విజ‌య్ దేవ‌రకొండ‌ను బీట్ చేయ‌లేక‌పోయాడు ధృవ్. మ‌రి రేపు సినిమా విష‌యంలో ఏం చేస్తాడో..?
Published by: Praveen Kumar Vadla
First published: September 22, 2018, 6:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading