అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంట్లో విషాదం..

Sandeep Reddy Vanga | ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుఝామున సందీప్ రెడ్డి వంగ తల్లి వంగ సుజాత కన్నుమూసారు.

news18-telugu
Updated: August 22, 2019, 11:53 AM IST
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంట్లో విషాదం..
సందీప్ రెడ్డి వంగ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుఝామున సందీప్ రెడ్డి వంగ తల్లి వంగ సుజాత కన్నుమూసారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆమె  ఈ రోజు తెల్లవారుఝామున ఆమె సొంతిల్లు వరంగల్‌లోని మరీ వెంకటయ్య కాలనీలో తుది శ్వాస విడిచారు. సందీప్ రెడ్డి తల్లి మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. సందీప్ రెడ్డి తెలుగులో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరో, హీరోయిన్లుగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. మరోవైపు ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరాడు. తెలుగులో  సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసిన అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే కదా.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు