హోమ్ /వార్తలు /సినిమా /

Vijay Devarakonda: అర్జున్ రెడ్డి డిలీటెడ్ సీన్ వైరల్.. ఇన్నేళ్ల తర్వాత పిచ్చెక్కిస్తున్న డైలాగ్స్

Vijay Devarakonda: అర్జున్ రెడ్డి డిలీటెడ్ సీన్ వైరల్.. ఇన్నేళ్ల తర్వాత పిచ్చెక్కిస్తున్న డైలాగ్స్

Vijay Arjun reddy Photo Instagram

Vijay Arjun reddy Photo Instagram

Arjun reddy deleted Scene: అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన ఐదేళ్లకు మరోసారి జనాన్ని ఆ ట్రాక్ లోకి తీసుకెళ్లారు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా. ఈ సినిమా నుంచి డెలీటెడ్ సీన్ ఒకటి వదిలి మరోసారి అదే ట్రెండ్ క్రియేట్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని లాగిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఫుల్ పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో తన మాస్ యాంగిల్ బయటకు తీసి యూత్ ఐకాన్ అయ్యారు. దీంతో ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు స్టార్‌ హోదా దక్కింది. డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) టేకింగ్ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఈ సినిమా విడుదలైన ఐదేళ్లకు మరోసారి జనాన్ని ఆ ట్రాక్ లోకి తీసుకెళ్లారు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా.


అర్జున్ రెడ్డి సినిమా నుంచి డెలీటెడ్ సీన్ ఒకటి వదిలి మరోసారి అదే ట్రెండ్ క్రియేట్ చేశారు. 2.53 నిమిషాలు ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెర్రస్ మీద ప్రీతిని అర్జున్ రెడ్డి ముద్దు పెట్టుకోవడం, అది ప్రీతి తండ్రి చూడటం.. ఆ తర్వాత పెద్ద గొడవ.. ప్రీతి అర్జున్ విడిపోవడం మనం సినిమాలో చూశాం. ఆ తర్వాత వచ్చే సీన్ ఇదే అని తాజా వీడియో తెలుపుతోంది.


ఈ సీన్‌లో విజయ్‌ దేవరకొండ, రాహుల్‌ రామకృష్ణ మధ్య సంభాషణలను చూపించారు. అమ్మ, నాన్న, నానమ్మ .. ఓ పది రోజుల తర్వాత కలిస్తే.. నాకు హగ్‌ ఇచ్చి కిస్‌ పెట్టుకునేవాళ్లురా. ఆ రోజు ప్రీతికి ఇచ్చింది అలాంటి కిస్సే అంటూ విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ తో ఈ వీడియో ప్రారంభమై ఆకట్టుకుంది. ఏదేమైనా ఇన్నేళ్లకు మరోసారి అర్జున్ రెడ్డి ట్రెండ్ క్రియేట్ చేయడంలో సందీప్ రెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి.


ఇకపోతే అర్జున్ రెడ్డి విడుదల తేదీ అయిన ఆగస్టు 25నే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమాకు తొలి రోజే డిజాస్టర్ టాక్ రావడంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏ మాత్రం అంచనాలు రీచ్ కాలేదని, సినిమాలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ మార్క్ ఎక్కడా కనిపించలేదని అంటున్నారు పబ్లిక్. మొత్తంగా చెప్పాలంటే లైగర్ సినిమా ఫట్ అయినట్లే అని రివ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండేపై తెలుగు ప్రేక్షకులు నెగెటివ్ గా స్పందిస్తున్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Arjun Reddy, Tollywood, Vijay Devarakonda

ఉత్తమ కథలు