Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాల విషయంలోనే కాదు.. సోషల్ మీడియాలో దూకుడు మీదున్నాడు. వివరాల్లోకి వెళితే.. ‘పెళ్లి చూపులు’ సినిమా వరకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని విజయ్ దేవరకొండ.. ఆ చిత్రంతో తొలి సక్సెస్ అందుకొని ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఈ సినిమాతో యూత్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు విజయ్. తనదైన ఆటీట్యూడ్‌తో.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ..మంచి నటనతో తెలుగు రాష్ట్రాల ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్నాడు. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత వచ్చిన ‘మహానటి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలు కూడా అద్భుత విజయాన్ని సాధించాయి. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అలరించకపోయినా.. యూత్‌లో మాత్రం విజయ్ దేవరకొండకు అంతే క్రేజ్ ఉంది.
తాజాగా విజయ్ దేవరకొండ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సౌత్‌లో ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండను 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సౌత్‌లో విజయ్ దేవరకొండ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నా.. విజయ్ ...ఈ రికార్డు అందుకోవడం విశేషం. ఇక విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను రెండేన్నరేళ్ల కింద ప్రారంభించాడు. ఇక విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్స్‌ను హ్యాండిల్ చేయడానికి ప్రత్యేకంగా కొంత మంది సిబ్బంది ఉన్నారు. ఐతే.. కరోనా నేపథ్యంలో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫండ్‌ను ఏర్పాటు చేసి తన వంతు సాయం చేసాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘పైటర్’ మూవీ చేస్తున్నాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.