హోమ్ /వార్తలు /సినిమా /

Liger : విజయ్ దేవరకొండ లైగర్ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ...

Liger : విజయ్ దేవరకొండ లైగర్ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ...

 Liger Photo twitter

Liger Photo twitter

Liger | Vijay Devarakonda | డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్, పాటలతో పాటు పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అది అలా ఉంటే ఆగస్టు 25న విడుదలై ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.. అవేంటో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరి జగన్నాథ్ (Puri Jagannnadh) దర్శకత్వంలో కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్ (Liger). అనన్యపాండే హీరోయిన్‌గా నటించారు.  మంచి అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే ఈ సినిమాను ఇప్పటికే చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. అసలు కథేంటీ, కథనం ఎలా ఉంది.. సినిమా ఏమాత్రం ఆకట్టుకుంటోంది.. మొదలకు అంశాలను చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం.. ఇక లైగర్ టిక్కెట్ ధరల (Liger Ticket Rates) విషయానికి వస్తే.. తెలంగాణ: గరిష్ట టిక్కెట్ ధర GSTతో కలిపి.. మల్టీప్లెక్స్‌లు: 250, సింగిల్ స్క్రీన్‌లు: 175 రూపాయలు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అక్కడ గరిష్ట టిక్కెట్ ధర - GSTతో కలిపి.. మల్టీప్లెక్స్‌లు: 177, సింగిల్ స్క్రీన్‌లు: 147‌రూపాయలుగా ఉండనున్నాయి. నైజాం ప్రాంతంలో ఈ సినిమాకు ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. ఊహంచని రేంజ్‌లో టిక్కెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నాయని తెలుస్తోంది.


    ఇక ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా నిడివి కూడా కాస్తా తక్కువుగానే ఉంది. ఈ సినిమా రెండు గంటల 20 నిమిషాలు ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్‌ కూడా ఓ రేంజ్‌లో జరిగిందని తెలుస్తోంది.  తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అందులో భాగంగా  ఒక్క నైజాం ఏరియాకే థియేట్రికల్ రైట్స్ 30 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. వరంగల్ శ్రీను ఈ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను కొన్నట్లు టాక్ నడుస్తోంది.  తెలుగులో టాప్ స్టార్స్‌ సినిమాలకు మామూలుగా ఈ రేంజ్‌లో బిజినెస్ జరుగుతుందని.. దీంతో ఈ రేంజ్‌లో విజయ్ సినిమాకు బిజినెస్ అంటే విశేషమే అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.













    ఇక మరోవైపు ట్రైలర్, పాటలు కూడా ఆకట్టుకోవడంతో.. టాక్ బాగుంటే లైగ‌ర్ బాక్సాపీస్ వ‌ద్ద రికార్డులు బద్దలు చేయడం ఖాయ‌మ‌ని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవర్సీస్ రైట్స్‌ను సరిగమ సినిమాస్ దక్కించుకుంది. దాదాపుగా 8 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్ అమ్ముడుపోయాయని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్, కెజీయఫ్ సినిమాలు కూడా సరిగమ సినిమాస్ ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక లైగర్ ట్రైలర్ (Liger Trailer) విషయానికి వస్తే.. ఊరమాస్ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటోంది ట్రైలర్‌లో.. క్రాస్ బ్రీడ్ సార్ వాడు.. అంటూ సాగే డైలాగ్‌తో మొదలైన.. మంచి విజువల్స్‌తో అదరగొట్టింది. దీనికి తోడు ఈ సినిమాలో విజయ్ నత్తితో సమమతమయ్యే క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది. చివరగా మైక్ టైసన్ డైలాగ్ కూడా బాగుంది. ఈ ప్యాన్ ఇండియా మూవీలో స్టార్ కిడ్ అనన్యపాండే హీరోయిన్‌గా (Ananya Panday) చేస్తున్నారు. ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించారు.



    ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 85 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్  (Liger) తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముతూ జీవనం గడిపే కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథ. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్  (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు.


    ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వచ్చింది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మించారు. ఈ సినిమా అలా ఉండగానే ఆయన పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాశారట. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి విజయ్ దగ్గరకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా విడుదల కానుంది. ఇక విజయ్, సమంతలు కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఖుషి అనే టైటిల్ ఖరారు అయ్యింది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Liger Movie, Puri Jagannadh, Vijay Devarakonda

    ఉత్తమ కథలు