Vijay Devarakonda and Puri Jagannadh movie Liger Release date confirmed and shooting details here
Vijay Devarakonda - Puri Jagannadh - Liger: పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతోన్న లైగర్ సినిమా రిలీజ్ డేట్ గురించి ఆసక్తికరమైన వార్తొకటి తెలిసింది. అలాగే షూటింగ్ ఎప్పటి నుంచి రీస్టార్ట్ అవుతుందో కూడా తెలిసింది. ఆ వివరాలు మీకోసం...
యూత్‌లో క్రేజీ స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `లైగర్`. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి రేపు అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఆసక్తికరమైన వార్తొకటి తెలిసింది. అదేంటంటే.. సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నారు. తెలుగు, హిందీ సహా మలయాళం, కన్నడ, తమిళ భాషల్లోనూ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్గా నటిస్తోంది.
విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో బాక్సర్ పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఈ యంగ్ హీరో మార్షల్ ఆర్ట్స్‌లోనూ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆసక్తికరమైన విషయమేమంటే.. కోవిడ్ తర్వాత చాలా సినిమాలు సెట్స్‌పైకి వెళ్లి షూటింగ్స్ రీస్టార్ట్ చేసుకున్నాయి. కానీ లైగర్ విషయంలో యూనిట్ కామ్‌గా ఉండింది. దీంతో అభిమానుల్లో టెన్షన్ ఏర్పడింది. అయితే యూనిట్ మాత్రం గురువారం నుంచి సినిమా షూటింగ్‌ను ముంబైలో స్టార్ట్ చేస్తారట. ఆ వివరాలను రేపు ప్రకటిస్తారు.
ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లయన్, టైగర్ క్రాస్ బ్రీడ్ `లైగర్`. కాబట్టి అలాంటి ఓ పవర్ఫుల్ టైటిల్‌ను పెట్టిన పూరీ జగన్నాథ్ `సాలా క్రాస్ బ్రీడ్` అనే క్యాప్షన్‌ను కూడా పెట్టుకున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించడంతో పాటు, ఛార్మి, కరణ్ జోహార్‌తో కలిసి ప్యాన్ ఇండియా మూవీగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.