Home /News /movies /

VIJAY DEVARAKONDA AND PURI JAGANNADH COMING TOGETHER FOR ONE MORE TIME AFTER LIGER HERE ARE THE DETAILS SR

Vijay Devarakonda | Puri Jagannadh : మహేష్‌తో అనుకున్న కథలో విజయ్.. హీరోయిన్‌గా జాన్వీ.. అదిరిన పూరి ప్లానింగ్..

Vijay Devarakonda Puri Jagannadh Photo : Twitter

Vijay Devarakonda Puri Jagannadh Photo : Twitter

Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

  Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా ఆగస్టు 25, 2022లో విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. ఇక అది అలా ఉంటే విజయ్‌తో పూరి మరో సినిమాను చేస్తున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్‌ ప్రియమైన ప్రాజెక్టు 'జనగనమణ'ను విజయ్ హీరోగా తెరకెక్కించాలనీ చూస్తున్నాడని టాక్. అయితే ఇదే కథతో గతంలో హీరో మహేష్ బాబుతో తీయాలని ప్రయత్నించారు పూరీ. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సొసైటీ మీద, పోలిటిక్స్‌పై ఈ కథ సాగుతుందట. ఈ సినిమాలో కీలకపాత్రలో హిందీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించనున్నారని అంటున్నారు. అంతేకాదు విలన్‌గా అజయ్ దేవగన్‌ తీసుకోవాలనీ పూరి భావిస్తున్నారట. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ ఫైనల్ అయ్యిందని, కరణ్ జోహార్ ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మించనున్నారని.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలకానుందట. చూడాలి మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం అవుతాయో..

  ఇక పూరీ, విజయ్ కాంబినేషన్‌‌లో వస్తున్న లైగర్ విషయానికి వస్తే.. ఈ సినిమా నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతూ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఆగస్టు 25, 2022లో విడుదల కానుంది. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియర్ అయ్యాడనేదే ఈ సినిమా కథలా కనిపిస్తోంది.


  పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్  (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.  ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది.

  Anchor Anasuya : వివాదంలో యాంకర్ అనసూయ.. గాంధీ ఫోటో ఎందుకంటూ ట్రోలింగ్..

  ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారట పూరీ. లైగర్ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూపోందుతుంది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు.

  ఇక విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Janhvi Kapoor, Puri Jagannadh, Tollywood news, Vijay Devarakonda

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు