వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌‌గా విజయ్ దేవరకొండ.. మరోసారి క్రేజీగా..

World famous lover : అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ..'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సినిమా ఫేం కాంత్రి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

news18-telugu
Updated: September 17, 2019, 1:07 PM IST
వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌‌గా విజయ్ దేవరకొండ.. మరోసారి క్రేజీగా..
విజయ్ దేవరకొండ (Twitter/TheDeverakonda)
  • Share this:
నటుడు విజయ్‌ దేవరకొండ అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన 'గీత గోవిందం' కూడా మంచి హిట్‌గా నిలిస్తే.. ఇటీవల వచ్చిన డియర్ కామ్రేడ్ అనుకున్నంతగా అలరించలేదు. అది అలా ఉంటే విజయ్.. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సినిమా ఫేం కాంత్రి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్‌ సరసన రాశీఖన్నా, ఇసబెల్లా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా.. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబందించి.. తాజాగా  ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్ర బృందం.


అందులో భాగంగా..‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం.  డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను క్రియేటివ్‌ కమర్షియల్స్ బ్యానర్‌పై వల్లభ నిర్మిస్తున్నారు. గోపి సుందర్‌ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌ను సెప్టెంబర్‌ 20న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading