news18-telugu
Updated: September 10, 2019, 7:42 AM IST
విజయ్, కియారా, కరణ్ జోహార్ Photo : Twitter
కియారా అద్వానీ.. మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో గ్రాండ్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మహేష్‌తో నటించిన ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది కియారా. అంతేకాకుండా 'భరత్ అనే నేను' బ్లాక్ బస్టర్ అవ్వడంతో మరో సూపర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ'లో అవకాశం దక్కించుకుంది. అంతేకాదు.. ఆ సినిమాలో మంచి తన పరిధి మేరకు నటనతో ఆకట్టుకోవడమే కాకుండా అంద చందాలతో తెలుగువారిని భాగానే ఆకర్షించింది. కానీ భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమాలో మేటర్ లేక.. బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో ఆ సినిమా తర్వాత మరే తెలుగులో సినిమాలో నటించలేదు.
హిందీలో ఈ భామ ఇటీవల తెలుగు 'అర్జున్ రెడ్డి' రీమేక్..'కబీర్ సింగ్'లో షాహిద్ కపూర్ సరసన చేసిన సంగతి తెలిసిందే.. హిందీ 'అర్జున్ రెడ్డి'ని కూడా సందీప్ రెడ్డినే దర్శకత్వం వహించగా.. ఆ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది. దీంతో సూపర్ ఫామ్‌లో కియారా.. హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమాకు ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను హిందీ నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ తన సొంత బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారని టాక్. అది అలా ఉంటే ఫ్యాషన్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో అవ్వుతాడు విజయ్ దేవరకొండ. అందులో భాగంగా ఆయన ‘రౌడీ’ అనే దుస్తుల బ్రాండ్‌ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ ఇద్దర్నీ ఓ దుస్తుల బ్రాండ్ కలిపింది. విజయ్, కియారా ఓ ప్రఖ్యాత దుస్తుల బ్రాండ్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. దానికి సంబందించిన యాడ్ షూటింగ్ ఇటీవల ముంబయిలో జరిగింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, కియారా అద్వానీ సంప్రదాయ వస్త్రధారణలో అదరగొట్టారు. ప్రస్తుతం విజయ్ తెలుగులో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంటే.. కియారా.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీబాంబ్' అనే ఓ హారర్ కామేడీలో అక్షయ్ కూమార్ జంటగా నటిస్తోంది. ఈ సినిమా తెలుగులో లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'కాంచన'కు రీమేక్‌గా వస్తోంది. 'లక్ష్మీబాంబ్' 2020 జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Published by:
Suresh Rachamalla
First published:
September 10, 2019, 6:52 AM IST