news18-telugu
Updated: December 9, 2019, 10:58 PM IST
Twitter
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ హీరో అయ్యాడు విజయ్. ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో మరింతగా ఎదిగాడు. కాగా ఆయన ఇటీవల నటించిన 'డియర్ కామ్రెడ్' సినిమా కొంత నిరాశ పరిచింది. అది అలా ఉంటే విజయ్ చాల రోజుల నుంచి మంచి కథతో హిందీ సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అందులో భాగంగా హిందీ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండను బాలీవుడ్‌కి పరిచయం చేసే బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాధ్, విజయ్ కాంబినేషన్లో రాబోతున్న ‘ఫైటర్’తో విజయ్ హిందీ చిత్ర సీమకు పరిచయం కాబోతున్నాడు. ఈ ఫైటర్‌ను తెలుగు, హిందీతో పాటు అన్ని సౌత్ భాషలలో ఒకేసారి తెరకెక్కించనున్నారు. ఫైటర్ కథ.. పాన్ ఇండియాకు అప్పీల్ అవుతుందని భావించిన కరణ్ జోహార్, పూరి, ఛార్మిలతో కలిసి ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. ఫైటర్ వచ్చే సంవత్సరం మొదటి నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
కేక పెట్టిస్తోన్న దిశా పటానీ బికినీ అందాలు..
Published by:
Suresh Rachamalla
First published:
December 9, 2019, 10:56 PM IST