Home /News /movies /

VIJAY DEVARAKONDA AND ANANYA PANDAY READY FOR CHIT CHAT IN TWITTER SLB

Vijay devarakonda: మీ ఇష్టం.. అడిగేయండి ఏదైనా చెప్పేస్తాం! విజయ్ దేవరకొండ, అనన్య రెడీ

Vijay Devarakonda
Photo/Twitter

Vijay Devarakonda Photo/Twitter

Liger Promotions: లైగర్ షూటింగ్ చేస్తూనే ఈ సినిమా నుంచి వదులుతున్న ఒక్కో అప్ డేట్ సినిమాపై హైప్ పెంచేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, అనన్య దేవరకొండ చేస్తున్న ప్రమోషనల్ ఈవెంట్స్ మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ జంటగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చేస్తూనే ఈ సినిమా నుంచి వదులుతున్న ఒక్కో అప్ డేట్ సినిమాపై హైప్ పెంచేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, అనన్య దేవరకొండ చేస్తున్న ప్రమోషనల్ ఈవెంట్స్ మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ట్విట్టర్ మూవీస్ ద్వారా ఓ సెషన్‌ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోని విజయ్, అనన్య వారి వారి అఫిషియల్ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి మేం త్వరలో ట్విట్టర్ మూవీస్‌లోకి రానున్నాం. #AskLiger యాష్‌ట్యాగ్‌తో ప్రశ్నలను అడిగేయండి అంటూ విజయ్ దేవరకొండ, అనన్య పాండే చెప్పారు.

విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై బోలెడన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. అల్ట్రా స్టైలిష్‌ లుక్‌లో విజయ్‌ని చూసి ఫిదా అవుతున్నారు ఆయన ఫ్యాన్స్. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీని ఎంతో గ్రాండ్‌గా ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. లైగర్ (Liger) కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడం విశేషం.



రీసెంట్‌గా విడుదల చేసిన విజయ్ దేవరకొండ సెమీ న్యూడ్ పోస్టర్ వైరల్‌గా మారడమే గాక జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది. పలువురు హీరోయిన్స్ కూడా ఈ పోస్టర్ చూసి తమ తమ ఫీలింగ్స్ బయటపెట్టారు. మొత్తానికైతే లైగర్ ప్రమోషన్స్‌లో పూరి మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం లైగర్ ట్రెండ్, జనం రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ సాధించడం ఖాయమే అని తెలుస్తోంది.
Published by:Sunil Boddula
First published:

Tags: Ananya Panday, Liger, Vijay Devarakonda

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు