Vijay Devarakonda: విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఖరారు.. సంచలన పాత్రతో..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పేరు ముంబైలో కూడా ఎక్కువ‌గా వినిపిస్తుంది. అక్క‌డ హీరోయిన్లు, దర్శక నిర్మాతలు ఈయ‌న‌కు ఫిదా అయిపోతున్నారు. ఇప్ప‌టికే జాన్వీ క‌పూర్, కియారా అద్వానీ లాంటి హీరోయిన్లే కాకుండా అర్జున్ కపూర్, వ‌రుణ్ ధావ‌న్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 24, 2020, 2:57 PM IST
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఖరారు.. సంచలన పాత్రతో..
విజయ్ దేవరకొండ (vijay devarakonda)
  • Share this:
విజయ్ దేవరకొండ పేరు ముంబైలో కూడా ఎక్కువ‌గా వినిపిస్తుంది. అక్క‌డ హీరోయిన్లు, దర్శక నిర్మాతలు ఈయ‌న‌కు ఫిదా అయిపోతున్నారు. ఇప్ప‌టికే జాన్వీ క‌పూర్, కియారా అద్వానీ లాంటి హీరోయిన్లే కాకుండా అర్జున్ కపూర్, వ‌రుణ్ ధావ‌న్ లాంటి హీరోలు కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌కు ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు ఈయ‌న సినిమాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది బాలీవుడ్. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలను రీమేక్ చేసారు. గతేడాది కబీర్ సింగ్ అక్కడ 300 కోట్ల వరకు వసూలు చేసి సంచలనం రేపింది. ‘గీత‌ గోవిందం’ సినిమాను కూడా రీమేక్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి (Vijay Devarakonda Arjun Reddy)
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి (Vijay Devarakonda Arjun Reddy)


ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయ‌న నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. తాజాగా ఈయన తొలి హిందీ సినిమా గురించి పూర్తి వివరాలు బయటికి వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతుంది. టి సిరీస్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు భన్సాలీ. కథ కూడా దేశభక్తి నేపథ్యంలో ఉండబోతుంది. గతేడాది పాకిస్థాన్‌లోని బాలాకోట్ ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సాహస దాడుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుంది.

అభినందన్ పాత్రలో విజయ్ దేరవకొండ (Vijay Devarakonda Abhinandan)
అభినందన్ పాత్రలో విజయ్ దేరవకొండ (Vijay Devarakonda Abhinandan)


ఈ దాడుల సందర్భంగా పాకిస్తాన్‌కి చిక్కిన అభినందన్ అందరికీ గుర్తున్నాడు కదా.. ఆయనపైనే ఇప్పుడు సినిమా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పాక్‌కు చిక్కిన తర్వాత కొన్ని రోజులకు ఆయన్ని విడుదల చేసారు. ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీరుడి పాత్ర ఆధారంగా ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు అభిషేక్ కపూర్ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. ఈయన 'రాక్ ఆన్', 'కేదార్‌నాథ్' లాంటి సినిమాలను తెరకెక్కించాడు. ఈ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అభినందన్ పాత్రలో విజయ్ దేరవకొండ (Vijay Devarakonda Abhinandan)
అభినందన్ పాత్రలో విజయ్ దేరవకొండ (Vijay Devarakonda Abhinandan)


భారీ బడ్జెట్‌తోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు పూరీ. హిందీలో కరణ్ జోహార్ దీన్ని విడుదల చేస్తున్నాడు. ఇదే ఏడాది షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు పూరీ. వచ్చే ఏడాది వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఫైటర్ టీమ్ (Vijay devarakonda fighter movie)
ఫైటర్ టీమ్ (Vijay devarakonda fighter movie)


పూరీ కనెక్ట్స్, పూరీ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై ఛార్మితో కలిసి ఫైటర్ సినిమా నిర్మిస్తున్నాడు పూరీ. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నాడు విజయ్ దేవరకొండ. అన్నీ కుదిరి అభిషేక్ కపూర్, భన్సాలీ సినిమా వర్కవుట్ అయితే మాత్రం బాలీవుడ్‌లో కూడా విజయ్ దేరవకొండ రేంజ్ పెరిగిపోవడం ఖాయం. అభినందన్ పాత్ర కావడం కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా చూడాలిక.. తెలుగులో సంచలనాలు సృష్టించిన రౌడీ హిందీలో ఏం చేస్తాడో..?
Published by: Praveen Kumar Vadla
First published: September 24, 2020, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading