హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తోన్న విజయ్ దేవరకొండ..

తాజాగా విజయ్ దేవరకొండ తనకు హిట్టు ఇచ్చిన దర్శకుడితో మరోసారి పనిచేయడానికి రెడీ అవుతున్నాడు.

news18-telugu
Updated: September 24, 2019, 12:44 PM IST
హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తోన్న విజయ్ దేవరకొండ..
విజయ్ దేవరకొండ (Twitter/TheDeverakonda)
  • Share this:
హిట్టు కాంబినేషన్.. ఒక హీరో, దర్శకుడి కాంబినేషన్‌లో ఒక సినిమా హిట్టైయితే చాలు.. వెంటనే అదే కాంబినేషన్‌లో మరో సినిమాకు పట్టాలెక్కడం ఇండస్ట్రీలో జరగుతూనే ఉంటుంది. తాజాగా విజయ్ దేవరకొండ తనకు హిట్టు ఇచ్చిన దర్శకుడితో మరోసారి పనిచేయడానికి రెడీ అవుతున్నాడు.  విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డితో’ ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ  రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్‌లో తనదైన శైలిలో మెప్పించాడు. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీతా గోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండ సాప్ట్ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఆ సినిమా తర్వాత దర్శకుడిగా పరశురామ్ క్రేజ్ పెరిగింది. తాజాగా పరుశురామ్ మరోసారి విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయడానికి సన్నాహాలు మొదలు  పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. ‘హీరో’ సినిమాతో పాటు ‘వరల్డ్ ఫేమస్ లవర్’,పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాల గ్యాప్‌లోనే పరశురామ్ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది.

vijay devarakonda again working with geetha govindam director parasuram,vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda worlda famous lover,vijay devarakonda hero,vijay devarakonda puri jagannadh fighter,vijay devarakonda fighter,fighter,world famous lover,vijay devarakonda geetha govindam,parasuram vija devarakonda,parasuram,director parasuram,vijay devarakonda facebook,vijay devarakonda instagram,vijay devarakonda dear comrade,dear comrade,tollywood,parasuram twitter,parasuram instagram,tollywood,telugu cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ గీతా గోవిందం,పరశురామ్ గీతా గోవిందం,విజయ్ దేవరకొండ పరశురామ్ గీతా గోవిందం,గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్‌తో విజయ్ దేవరకొండ,వరల్డ్ ఫేమస్ లవర్,డియర్ కామ్రేడ్,ఫైటర్,హీరో,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ కొత్త మూవీ,
విజయ్ దేవరకొండ,దర్శకుడు పరశురామ్ (Twitter/Photos)


మరోవైపు పరశురామ్.. అఖిల్‌తో ఒక సినిమా దాదాపు ఖరారైంది. విజయ్ దేవరకొండ సినిమాను అఖిల్‌ సినిమా కంప్లీట్ అయిన తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి రెండోసారి వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా టాలీవుడ్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి 

Posani: జబర్దస్త్ టీమ్‌తో కలిసి భజన బ్యాచ్‌లో చేరిన పోసాని కృష్ణ మురళి..

కొండారెడ్డి బురుజు సాక్షిగా..మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’..

సాయి పల్లవిని పెళ్లాడుతానంటున్న వరుణ్ తేజ్..
Published by: Kiran Kumar Thanjavur
First published: September 24, 2019, 12:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading