విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్..

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి  విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ అదిరిపోయింది.

news18-telugu
Updated: July 24, 2019, 4:03 PM IST
విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్..
విజయ్ దేవరకొండ రష్మిక మందన్న
  • Share this:
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి  విడుదల కానుంది. అంతేకాదు  ఈ సినిమాను రిలీజ్ కు ముందే బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి కరణ్ జోహార్ రెడీ అయిన సంగతి తెలిసిందే కదా. ‘గీతా గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ సినిమాలో జోడిగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న మైత్రీ మూవీ  మేకర్స్ ఈ సినిమా భారీ ఎత్తున తెరకెక్కించారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ అన్ని భాషల్లో ఈ సినిమాను తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. నాలుగు భాషల్లో కలిసి ‘డియర్ కామ్రేడ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. రూ. 36.40 కోట్లకు జరిగినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

vijay devaradkonda dear comrade movie pre release business very high,dear comrade pre release business,dear comrade movie review,vijay devarakonda dear comrade movie review,vijay devarakonda,vijay deverakonda,vijay devarakonda speech,vijay devarakonda interview,vijay devarakonda new movies,vijay deverakonda movies,vijay devarakonda and rashmika kiss,vijay devarakonda fires on media over lip lock,dwaraka telugu full movie vijay devarakonda,vijay devarakonda fires on media over lip lock questions,vijay devarakonda and rashmika kiss scene,rashmika mandanna,rashmika mandanna twitter,rashmika mandanna instagram,rashmika mandanna hot photos,rashmika mandanna vijay devarakonda lip lock,rashmika mandanna vijay devarakonda lip kiss,rashmika mandanna vijay devarakonda dear comrade,rashmika mandanna fans fire,rashmika mandanna vijay devarakonda geetha govindam lip lock,telugu cinema,rashmika mandanna twitter fans fire,kannada cinema,రష్మిక మందన్న,విజయ్ దేవరకొండ రష్మిక మందన్న లిప్ లాక్,డియర్ కామ్రేడ్ ముద్దు సీన్,రష్మిక మందన్న ముద్దులు,కన్నడ ఫ్యాన్స్ హర్ట్,రష్మిక మందన్న ఫ్యాన్స్ ఫైర్,తెలుగు సినిమా,గీత గోవిందం ముద్దు సీన్,డియర్ కామ్రేడ్ ప్రీరిలీజ్ బిజినెస్,డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ,విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ,
డియర్ కామ్రేడ్ రిలీజ్ పోస్టర్


తెలంగాణ (నైజాం)లో ఈ సినిమా రూ.9 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. రాయలసీమ (సీడెడ్) రూ.3.60 కోట్లకు అమ్ముడు పోయింది. ఏపీ విషయానికొస్తే.. ఈస్ట్ గోదారి రూ.1.80 కోట్లు, వెస్ట్ గోదావరి రూ.1.40 కోట్లు, గుంటూరు రూ.2 కోట్లు, కృష్ణ రూ.1.60 కోట్లు, నెల్లూరు. రూ.80 లక్షలకు మిగిలిన ఏరియాల్లో రూ. 2.40 కోట్లకు అమ్ముడుపోయింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 22.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళలలో కలిపి రూ.8 కోట్లకు అమ్ముడు పోయింది. ఓవర్సీస్‌లో రూ.4 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. మొత్తంగా రూ.34.60 కోట్లకు అమ్ముడుపోయింది. మొత్తానికి ‘డియర్ కామ్రేడ్’ సినిమా విజయ్ దేవరకొండ‌ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. మరోవైపు అన్ని భాషల్లో డిజిటల్, శాటిలైట్ రైట్స్ అధనం. ఏ రకంగా చూసిన ‘డియర్ కామ్రేడ్’ రిలీజ్‌కు ముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ అందించదనే చెప్పాలి.

 

First published: July 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు