Home /News /movies /

VIJAY DEVARA KONDA PERIODIC FILM WITH STAR DIRECTOR MHN

Vijay DevaraKonda Different Role: సరికొత్త పాత్రలో విజయ్ దేవరకొండ.. ఆ స్టార్ డైరెక్టర్ మరి విజయ్ ఇమేజ్‌ని పెంచుతాడా? లేదా?

విజయ్, సుకుమార్ Photo : Twitter

విజయ్, సుకుమార్ Photo : Twitter

Vijay Devarakonada - Periodic Film: పూరి తర్వాత విజయ్ దేవరకొండ చేయబోతున్న సినిమాల్లో ఓ సినిమా పీరియాడిక్ మూవీ. అందులో విజయ్ దేవరకొండ ఎలాంటి పాత్రను చేయబోతున్నాడో తెలుసా..?

  కోవిడ్ ఎఫెక్ట్‌కు ఆరేడు నెల‌లు దాకా సినిమా షూటింగ్స్‌కు వెళ్లాలంటే స్టార్స్ అంద‌రూ భ‌య‌ప‌డ్డారు. ఇప్పుడిప్పుడే చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, వెంకటేశ్ వంటి సీనియ‌ర్ హీరోలు సహా నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కులు, ఇత‌ర స్టార్ హీరోలు సెట్స్‌పైకి వెళ్లారు. అయితే కానీ ఓ హీరో మాత్రం సినిమా చేయ‌డానికి ఆలోచిస్తాడా? లేక ప‌రిస్థితులు అనుకూలించ‌డం లేదేమో కానీ.. త‌న సినిమా షూటింగ్‌ను మాత్రం స్టార్ట్ చేయ‌డం లేద‌ట‌. ఆ హీరో ఎవ‌రో ప్ర‌త్యేకంగాచెప్ప‌న‌వ‌స‌రం లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ యంగ్ హీరో, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా లైగ‌ర్‌. అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా పునః ప్రారంభం కాలేదు. జ‌న‌వ‌రి త‌ర్వాత లైగ‌ర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా.. మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యి ఉన్న సంగ‌తి తెలిసిందే.

  లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రాన్ని సుకుమార్ త‌న‌దైన స్టైల్లో పీరియాడిక్ మూవీగా తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌. ఇండియా, పాకిస్థాన్ మధ్య జ‌రిగిన యుద్ధ నేప‌థ్యంలో ఓ ప్రేమ క‌థా చిత్రాన్ని సుకుమార్ ప్లాన్ చేశాడ‌ని అంటున్నారు. ఇందులో విజ‌య్ దేవ‌రకొండ సైనికుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడని టాక్‌. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌లో కేదార్ సలగంశెట్టి నిర్మిస్తున్నారు. ల‌వ‌ర్‌బోయ్‌గా, ర‌ఫ్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించిన విజ‌య్ దేవ‌ర‌కొండను సుకుమార్ కొత్త‌గా చూపిస్తాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండలోని న‌టుడిని బ‌య‌ట‌కు తీసుకు రావ‌డానికి ఈ సినిమా చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది. ఎందుకంటే ఇక్క‌డ రెండు కార‌ణాలున్నాయి. అందులో మొద‌టిది డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం బ‌న్నీతో ప్యాన్ ఇండియా మూవీ పుష్ప‌ను పూర్తి చేయాల్సి ఉంది. సాధార‌ణంగా ఒక భాష‌లోనే సినిమా చేయ‌డానికి ఎక్కువ స‌మయం తీసుకునే సుక్కు.. మ‌రి ప్యాన్ ఇండియా సినిమాను పూర్తి చేయ‌డానికి ఇంకెంత స‌మ‌యం తీసుకుంటాడో చూడాలి. మ‌రో వైపు పూరీ జ‌గ‌న్నాథ్‌తో సినిమాను పూర్తి చేసిన త‌ర్వాత శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో సినిమా చేయాల్సి ఉంది. ఇది పూర్తయ్యాకే సుకుమార్ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది.

  చిన్న చితకా పాత్రలు చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండకు ఎవడే సుబ్రహ్మణ్యం నటుడిగా మంచి బ్రేక్ ఇస్తే.. హీరోగా చేసిన పెళ్లిచూపులు సూపర్‌హిట్ అయ్యి.. తనకి క్రేజ్‌ని సంపాదించి పెట్టింది. తర్వాత చేసిన అర్జున్ రెడ్డి ఓ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ పెరగడమే కాదు.. స్టార్ హీరోగా మారిపోయాడు. తర్వాత వచ్చిన గీత గోవిందం వందకోట్ల రూపాయల వసూళ్లను సాధించి విజయ్ దేవరకొండ రేంజ్‌ను ఆకాశానికి అంటేలా చేసింది. మధ్యలో వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, నోటా చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, క్రేజ్ మాత్రం తగ్గలేదు. మరి రాబోయే కాలంలో విజయ్, ఈ క్రేజ్‌ని అలాగే కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.
  Published by:Anil
  First published:

  Tags: Puri Jagannadh, Sukumar, Vijay Devarakonda

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు