పూరి జగన్నాధ్, విజయ్ సినిమాలో ఆ సీన్స్‌కు కేక పెట్టాల్సిందేనట..

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా దాదాపు 40 రోజుల పాటు ముంబైలో షూటింగ్ జరుపుకుని.. టీమ్ తాజాగా హైదరాబాద్‌ చేరుకుంది.

news18-telugu
Updated: March 11, 2020, 7:13 AM IST
పూరి జగన్నాధ్, విజయ్ సినిమాలో ఆ సీన్స్‌కు కేక పెట్టాల్సిందేనట..
ఇక కెరీర్ విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలోనూ ఓ సినిమా ప్రకటించాడు విజయ్. దాంతో పాటు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
  • Share this:
పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు 40 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుపుకుని తాజాగా హైదరాబాద్‌ చేరుకుంది. ఈ సినిమాతో విజయ్ హిందీ చిత్ర సీమకు పరిచయం కాబోతున్నాడు విజయ్. ఫైటర్‌‌గా పిలువబడుతున్న ఈ సినిమా తెలుగు, హిందీతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో విడుదలకానుంది. ఫైటర్ కథ.. పాన్ ఇండియాకు అప్పీల్ అవుతుందని భావించిన కరణ్ జోహార్, పూరి, ఛార్మిలతో కలిసి ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదటినుండి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను తీసుకుంటున్నారని టాక్ వినిపించింది. అయితే జాన్వీ ఇతర సినిమాల్లో బిజీగా ఉండడంతో యంగ్ బ్యూటీ, నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే విజయ్ సరసన నటిస్తోంది. తాజాగా విజయ్‌ అనన్యలపై రాత్రి సమయంలో ముంబయి రోడ్లపై బైక్‌రైడ్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. వీటికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీకవడంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెండు భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు షూట్ చేశారట. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ను పూరి చాలా కొత్తగా తెరకెక్కించాడని తెలుస్తోంది.

 Vijay Deverakonda action scenes,Vijay Deverakonda to romance with Ananya panday,Purijagannadh Fighter,vijay devarakonda,vijay devarakonda fighter movie,vijay devarakonda new movie,vijay devarakonda fighter,vijay devarakonda movies,vijay deverakonda,vijay devarakonda fighter movie updates,vijay devarakonda fighter teaser,vijay devarakonda songs,vijay deverakonda movies,vijay devarakonda jhanvi kapoor,vijay devarakonda movies in hindi dubbed,vijay devarakonda fighter movie trailer,పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే,ఛార్మి,కరణ్ జోహార్
ఫైటర్ టీమ్ Photo : Twitter


కాగా క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా భారీ స్థాయిలో పూరి ప్లాన్ చేస్తోన్నాడట. తాజాగా ముగిసిన షెడ్యూల్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌మ్య‌కృష్ణ‌, అన‌న్యా పాండే, రోణిత్ రాయ్‌, అలీ త‌దిత‌రుల‌పై ముఖ్య‌మైన స‌న్నివేశాలు తీశారు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.కాగా తాజాగా విజయ్ ప్రధాన పాత్రలో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. దీనితో ఈ సినిమా పైన ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ అని ఫిక్స్ చేసినప్పటికీ దీనిపైన కరణ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. భారీ అంచనాల నడుమ ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.
Published by: Suresh Rachamalla
First published: March 11, 2020, 7:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading