Bigil: విజయ్ ‘బిగిల్’ ట్రైలర్ టాక్.. చూస్తే ‘విజిల్’ వేయాల్సిందే..

విజయ్ ఇమేజ్ ప్ర‌స్తుతం త‌మిళ‌నాట ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తాజాగా ఈయన హీరోగా అట్లీ దర్శకత్వంలో ‘బిగిల్’ సినిమా చేసాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు.

news18-telugu
Updated: October 12, 2019, 6:37 PM IST
Bigil: విజయ్ ‘బిగిల్’ ట్రైలర్ టాక్.. చూస్తే ‘విజిల్’ వేయాల్సిందే..
ఇళయతలపతి విజయ్
news18-telugu
Updated: October 12, 2019, 6:37 PM IST
విజయ్ ఇమేజ్ ప్ర‌స్తుతం త‌మిళ‌నాట ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వ‌ర‌స విజ‌యాల‌తో నెంబ‌ర్ వ‌న్  స్థానంపై కన్నేసాడు ఇళయ ద‌ళ‌ప‌తి. తాజాగా విజయ్.. అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘బిగిల్’ సినిమా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్‌లో ‘తేరి’ ‘మెర్సల్’  రెండు సినిమాలు వ‌చ్చాయి.  తెలుగులో  ఈ సినిమాకు తెలుగులో ‘విజిల్’ టైటిల్ ఖరారు చేసారు.   విజ‌య్ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఒలంపిక్స్ నేప‌థ్యంలో తెరకెక్కిస్తున్నాడు అట్లీ కుమార్. అక్క‌డ జ‌రిగే అన్యాయాల‌పై చూపిస్తున్నాడు అట్లీ.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు.

ఈ ట్రైలర్ మొత్తం తనదైన మేనరిజమ్‌తో పాటు యాక్షన్‌తో అదరగొట్టేసాడు విజయ్. ఇందులో విజ‌య్ ఫుట్ బాల్ కోచ్ పాత్ర‌లో న‌టించాడు. ఇదివ‌ర‌కు ఈయ‌న విజ‌య్ తో తెర‌కెక్కించిన ‘తెరీ’.. ‘మెర్స‌ల్’ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచాయి. ఇందులో ‘మెర్స‌ల్’ కోసం ఏకంగా మెడిక‌ల్ మాఫియాను క‌దిలించాడు ద‌ర్శ‌కుడు అట్లీకుమార్. ఇక ఇప్పుడు ఏకంగా ఒలంపిక్స్‌నే టార్గెట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఫుట్ బాల్ కోచ్‌గా న‌టిస్తున్నాడు విజ‌య్. ఇందులో విజయ్ మరోసారి  ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు ద‌ళ‌ప‌తి. ఈ సినిమాలో సాక‌ర్ టీం కోసం 16 మంది అమ్మాయిలను తీసుకున్నాడు దర్శకుడు అట్లీ. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. 

తెలుగులో ‘విజిల్’ టైటిల్‌తో రానున్న విజయ్ ‘బిగిల్’ మూవీ (twitter/Photo)


త‌మిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ సినిమాకు ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. వివేక్‌, యోగిబాబు, డేనియల్‌ బాలాజీ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇందులో న‌య‌న‌తార హీరోయిన్. ‘విల్లు’ త‌ర్వాత మ‌రోసారి ఈ జోడీ క‌లిసి న‌టిస్తున్నారు. మొత్తానికి తెరీ, మెర్స‌ల్ త‌ర్వాత విజ‌య్, అట్లీ మ‌రో సంచ‌ల‌నానికి తెర‌తీస్తున్నారు. తెలుగులో కూడా ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. అదిరింది, స‌ర్కార్ సినిమాల త‌ర్వాత తెలుగులో విజ‌య్ మార్కెట్ బాగానే పెరిగింది. మరి ‘విజిల్’తో విజయ్ తెలుగులో మరోసారి బాక్సాఫీస్ దగ్గర విజిల్ వేస్తాడా లేదా అనేది చూడాలి.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...