Vijay-Pooja Hegde | Beast : తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇపుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘బీస్ట్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మొదటి సారి పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఇక అది అలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదలై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని తెలిపింది టీమ్. అయితే ఇక్కడ చెప్పాల్సిన మరో విషయం ఏమంటే.. కన్నడ సంచలన చిత్రం KGF: చాప్టర్ 2 ఏప్రిల్ 14న వస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. దీంతో ఒక రోజు గ్యాపులో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి. బీస్ట్ తమిళనాడులో KGF: చాప్టర్ 2ని డామినేట్ చేస్తుంది. కానీ సినిమా మిగతా అన్ని ప్రాంతాలలో మాత్రం KGF డామినేట్ చేయోచ్చని అంటున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన బీస్ట్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. బీస్ట్ తెలుగు థియేట్రికల్ రైట్స్ ఇటీవలే అమ్ముడయ్యాయి. ఈ చిత్రాన్ని చెన్నై, జార్జియాల్లో భారీ స్థాయిలో చిత్రీకరించారు. విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. అనిరుధ్ సంగీతం, నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు.
విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో.. చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను జోరు మీద చేస్తున్నారు. ఈ కోవలో ఈ సినిమా నుంచివిడుదల చేసిన అరబిక్ కుతు అనే సాంగ్‌ను విడుదల చేశారు. అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతం అందించారు. ఈ పాట విడుదలైన మొదటి రోజు నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక పాట తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాట ఇప్పటి వరకు 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుని క్రియేట్ చేసింది. దీంతో టీమ్ దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పాటను జోనితా గాంధీ, అనిరుధ్ (Anirudh Ravichander) పాడగా.. శివ కార్తికేయన్ లిరిక్స్ అందించారు.
#BeastFromApril13@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @selvaraghavan @manojdft @Nirmalcuts @anbariv #Beast pic.twitter.com/htH6dTPX2q
— Sun Pictures (@sunpictures) March 22, 2022
ఇక ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. ‘జాలీ ఓ జింఖానా’ (Jolly O Gymkhana) అనే టైటిల్‌తో విడుదలైన ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కూ కార్తిక్ రాసిన ఈ పాటను ఈ సినిమా హీరో (Thalapathy Vijay) విజయ్ స్వయంగా పాడారు. ఇక ఇప్పటికే బీస్ట్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తున్నారు.
Happy Birthday Suma Kanakala : సుమ కనకాల హీరోయిన్‌గా చేసిన సినిమా ఏంటో తెలుసా..
ఇక ఈ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విషయానికి వస్తే... గత ఏడాది శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ సినిమాతో సంచలన విజయం అందుకున్నారు నెల్సన్. ఈ సినిమా కంటే ముందు నయనతారతో చేసిన కోకో సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఏకంగా విజయ్ హీరోగా సినిమా చేసే అవకాశం అందుకున్నారు. త్వరలోనే ఈయన రజనీకాంత్‌తో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.