Vijay - Beast Telugu Pre Release Business | తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా తెలుగు మార్కెట్ పై పట్టు సాధిస్తున్నారు. ఇక్కడ వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ మూవీతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘బీస్ట్’ అనే మూవీ చేసారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాలో విజయ్ సరసన మొదటి సారి పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ (Beast Trailer) చూస్తుంటే.. మాస్ అండ్ యాక్షన్ అంశాలతో వావ్ అనిపించింది. విజయ్ ఇండియన్ స్పై వీర రాఘవ అనే ఏజెంట్‌గా కనిపించి కేక పెట్టించారు.
తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఒక షాపింగ్ మాల్‌ను టెర్రరిస్టులు హైజాక్ చేస్తారు. ఈ నేపథ్యంలో అనుకోకుండా అక్కడే ఉన్న ఓ మిలటరీ స్పై ఏజెంట్ వీరరాఘవ.. టెర్రరిస్టులను నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడాడు అనేదే ఈ సినిమా స్టోరీ. బీస్ట్ ట్రైలర్‌లో (Beast Trailer) అనిరుధ్ రవిచంద్రన్ ఆర్ఆర్ మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. మరి థియేటర్స్‌లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక అది అలా ఉంటే.. ఈ సినిమా ఈ తెలుగులో కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ బిజనెస్ విషయానికొస్తే..
నైజాం (తెలంగాణ): రూ. 3.50 కోట్లు
సీడెడ్ (రాయలసీమ): రూ. 2.1 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్: రూ. 4.40 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ : రూ. 10 కోట్లు
ఈ సినిమా తెలుగులో హిట్ అనిపించుకోవాలంటే.. రూ. 10.50 కోట్లు వసూళు చేయాలి. ఈ సినిమాకు పోటీగా కేజీఎఫ్ 2 గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను దిల్ రాజు (Dil Raju) దక్కించుకున్నారు. ఈ ట్రైలర్‌ను చూసిన నెటిజన్స్ మాత్రం.. ట్రైలర్‌లోని కొన్ని సీన్స్ మాత్రం ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సిరీస్ మనీ హీస్ట్‌ను పోలి ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.మరోవైపు దిల్ రాజు నిర్మాణంలో విజయ్ .. వంశీ పైడిపల్లితో రీసెంట్‌గా తన 66వ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా.
బీస్ట్ తెలుగు థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయింట. ఆయన గత సినిమా ‘మాస్టర్’ తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా రూ. 6 కోట్ల మేర బిజినెస్ చెయ్యగా.. దాదాపు రూ. 14 కోట్లు మేర వసూళ్లు అందుకొని తెలుగులో కూడా మంచి హిట్‌గా నిలిచింది. ఒక రోజు గ్యాపులో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి.
RRR 18 Day WW Collections : ఆర్ఆర్ఆర్ 18 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఎంత కలెక్ట్ చేసిందంటే..
బీస్ట్ తమిళనాడులో KGF: చాప్టర్ 2ని డామినేట్ చేస్తుంది. కానీ సినిమా మిగతా అన్ని ప్రాంతాలలో మాత్రం KGF డామినేట్ చేయోచ్చని అంటున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన బీస్ట్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ సినిమాకు కువైట్‌లో రిలీజ్‌కు అడ్డంకులు ఏర్పడ్డాయి.కువైట్ సమాచార మంత్రిత్వ శాఖ బీస్ట్‌ను నిషేధించింది.ఈ సినిమాలో పాక్ టెర్రరిస్టులతో పాటు ఇస్లామిక్ టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కించిన నేపథ్యంలో ఈ సినిమాను అక్కడ బ్యాన్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ ‘కురుపు’, ‘FIR’ వంటి చిత్రాలతో పాటు తాజాగా ‘బీస్ట్’ చిత్రాన్ని బ్యాన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Beast Movie, Kollywood, Tollywood, Vijay