హోమ్ /వార్తలు /సినిమా /

Vijay - Beast : విజయ్ అభిమానుల అతి.. టాక్ బాగాలేదని ఏకంగా థియేటర్‌కు నిప్పు పెట్టారు..

Vijay - Beast : విజయ్ అభిమానుల అతి.. టాక్ బాగాలేదని ఏకంగా థియేటర్‌కు నిప్పు పెట్టారు..

బీస్ట్ ప్రదర్శిస్తోన్న థియేటర్‌కు నిప్పు పెట్టిన విజయ్ అభిమానులు( Vijay Beast Photo : Twitter)

బీస్ట్ ప్రదర్శిస్తోన్న థియేటర్‌కు నిప్పు పెట్టిన విజయ్ అభిమానులు( Vijay Beast Photo : Twitter)

Vijay - Beast : విజయ్ బీస్ట్ మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కానీ ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో విజయ్ వీరాభిమానులు కొంత మంది హర్ట్ అయ్యారు. అంతేకాదు తమిళనాడులోని ఓ థియేటర్‌లోని సినిమా ప్రదర్శిస్తుండగా స్క్రీన్‌కు నిప్పు పెట్టేసారు.

ఇంకా చదవండి ...

Vijay - Beast : దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటోంది. అది అభిమానానికైనా.. దురభిమానానికైనా.. అది హద్దులు దాటితే అంతే సంగతులు. ఇక తమిళనాట అగ్ర హీరోల అభిమానులు  ఒకప్పుడు డైరెక్ట్‌గా తలపడితే.. ఇపుడు సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. ఇక విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గు మనేలా ఫ్యాన్ వార్ ఉంది. తాజాగా విజయ్ ‘బీస్ట్’ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో విజయ్ అభిమానులు ఏకంగా సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్‌కు నిప్పు పెట్టేసారు. వివరాల్లోకి వెళితే.. తమిళ అగ్ర హీరో విజయ్ (Vijay)  గత కొన్నేళ్లుగా తెలుగు మార్కెట్ పై పట్టు సాధిస్తున్నారు. ఇక్కడ వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ మూవీతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘బీస్ట్’ అనే మూవీ చేసారు.

ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో హీరో విజయ్.. వీరరాఘవ అనే స్పై ఏజెంట్ పాత్రలో అదరొట్టాడు. ఈ సినిమాను యాక్షన్ కంటే కామెడీకే దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సినిమా పై అవతలి హీరో అభిమానులు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మరోవైపు సినిమా కూడా అనుకున్న విధంగా లేకపోవడంతో హర్ట్ అయిన తమిళనాడులోని ఓ థియేటర్‌లోని విజయ్ వీరాభిమానులు సినిమా ప్రదర్శిస్తుండగా స్క్రీన్‌కు నిప్పు పెట్టేసారు. ఈ సందర్భంగా కొంత మంది సినిమా బాగాలేతే.. చూడకూడదు. ఇలా థియేటర్‌కు నిప్పు పెట్టడం ఏమిటి అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కానీ విజయ్ అభిమానులు మాత్రం .. ఇది వేరే హీరోల అభిమానులు కావాలని చేసిన పని అంటూ కూడా చెబుతున్నారు.

KGF 2 - Sanjay Dutt : సంజయ్ దత్ సహా సౌత్ సినీ ఇండస్ట్రీలో రఫ్ ఆడించిన బాలీవుడ్ హీరోలు వీళ్లే..


మొత్తంగా విజయ్ ‘బీస్ట్’కు నెగిటివ్ టాక్ రావడం.. ఫ్యాన్స్ థియేటర్‌కు నిప్పు పెట్టడం ఇపుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. మరి నచ్చకపోతే.. లేచి వెళ్లిపోవాలి కానీ.. ఇలా చేయడమేమిటి అని ప్రశ్నిస్తున్నారు. సదురు ఘటనకు ఎవరు పాల్పడ్డారనే విషయమై  థియేటర్ యాజమాని  ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ఈ సినిమా రూ. 10 కోట్లకు అమ్మారు.   హిట్ అనిపించుకోవాలంటే.. రూ. 10.50 కోట్లు వసూళు చేయాలి.  మరోవైపు విజయ్ దిల్ రాజు నిర్మాణంలో విజయ్ .. వంశీ పైడిపల్లితో రీసెంట్‌గా తన 66వ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఇక చెన్నైలోని పలు కార్పోరేట్స్ కంపెనీల హెచ్ ఆర్‌లకు లీవ్ కావాలంటూ చాలా అప్లీకేషన్స్ రావడంతో చేసేదేం లేక బీస్ట్ విడుదల రోజు కంపెనీకి సెలవు కూడా ప్రకటించాయి.

First published:

Tags: Beast Movie, Kollywood, Tollywood, Vijay

ఉత్తమ కథలు