హోమ్ /వార్తలు /సినిమా /

Beast 5 Days WW Collections : విజయ్ ‘బీస్ట్’ 5 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..

Beast 5 Days WW Collections : విజయ్ ‘బీస్ట్’ 5 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..

విజయ్ ‘బీస్ట్’ 5 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్  (Beast Telugu Photo : Twitter)

విజయ్ ‘బీస్ట్’ 5 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ (Beast Telugu Photo : Twitter)

Vijay - Beast 5 Days World Wide Collections  | తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay)  గత కొన్నేళ్లుగా తెలుగు మార్కెట్ పై పట్టు సాధిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో ఎంత రాబట్టిందంటే..

Vijay - Beast 5 Days World Wide Collections  | తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay)  గత కొన్నేళ్లుగా తెలుగు మార్కెట్ పై పట్టు సాధిస్తున్నారు. ఇక్కడ వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ (Master) మూవీతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘బీస్ట్’ అనే మూవీ చేసారు. ఈ నెల 13న విడుదలైన ’బీస్ట్’ సినిమా బ్యాడ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టింది.  ఈ సినిమాలో విజయ్ సరసన మొదటి సారి  పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఈ సినిమా ఈ సినిమాలో విజయ్‌ ఇండియన్‌ స్పై వీర రాఘవ అనే ఏజెంట్‌గా కనిపించి కేక పెట్టించారు. ఈ సినిమా మొదటి రోజు మంచి వసూళ్లనే రాబట్టింది.

ఇక స్పై యాక్షన్-థ్రిల్లర్‌గా వచ్చిన బీస్ట్ విషయానికి వస్తే.. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ భారీగా నిర్మించింది. పూజాహెగ్డే హీరోయిన్‌గా చేశారు.  చెన్నైలో కొందరు అభిమానులు ఏకంగా సినిమా బాగాలేదని థియేటర్‌‌ను తగలబెట్టారు. ఈ సినిమా రూ. 10.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమాకు పోటీగా వచ్చిన కేజీఎఫ్ 2 దూకుడు ముందు ఈ సినిమా తేలిపోయింది.  ఈ సినిమా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 6.94 కోట్ల షేర్ ( రూ. 12.40 కోట్లు గ్రాస్) వసూళ్లను సాధించింది.  తెలుగులో ఈ  సినిమా రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 3.5 కోట్ల వసూళ్లను రాబట్టాలి.

Nagarjuna: ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జున డూప్‌గా నటించింది ఈ స్టార్ హీరోనే.. ఇంత ఎవరో తెలుసా..

తమిళనాడు :  రూ. 49.50 కోట్లు  /రూ . 66 కోట్లు

తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ : రూ. 6.94 కోట్లు  / రూ. 10 కోట్లు

కర్ణాటక: రూ. 6.10 కోట్లు / రూ. 8 కోట్లు

కేరళ: రూ. 4.60 కోట్లు  / రూ. 7.50 కోట్లు

హిందీ + రెస్టాఫ్ భారత్ : రూ. 1.58 కోట్లు /రూ. 3 కోట్లు

ఓవర్సీస్ : రూ. 25.10 కోట్లు / రూ. 31 కోట్లు

టోటల్ :రూ. 125.50 / 185.50  కోట్లు షేర్ రాబట్టింది. ఈ సినిమా ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఇంకా రూ. 60 కోట్ల షేర్ రాబట్టాలి. తమిళంలో వసూళ్లును సాధించాలి. మిగతా భాషల్లో ఈ సినిమా కోలుకోవడం కష్టమే అని చెప్పాలి.

KGF 2 - RRR - Bahubali : కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, బాహుబలి సహా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు..

ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదలపై అప్పుడే సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ OTT హక్కులు SunNxt, ఇంకా Netflix వద్ద ఉన్నాయి. సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత మాత్రమే OTTలో విడుదల చేయాలనేది ఒప్పందం. అయితే బీస్ట్ అనుకున్నంతగా ఆకట్టుకోవడం లేదు. దీంతో ముందే రావోచ్చని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది.

First published:

Tags: Beast Movie, Kollywood, Tollywood, Vijay

ఉత్తమ కథలు